Susheel Kumar Modi: బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత
ABN, Publish Date - May 14 , 2024 | 12:32 PM
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా వెల్లడించింది.
పాట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా వెల్లడించింది. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చి రోజులు గడవక ముందే సుశీల్ కుమార్ మోదీ మరణించడం ఆ పార్టీని కలచివేస్తోంది.
Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..
పార్టీలో తన సహచరుడు, తన మిత్రుడు అయిన సుశీల్ మోదీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. బీహార్‌లో బీజేపీ ఎదుగుదలలోనూ తన విజయంలోనూ సుశీల్ మోదీ పాత్ర అనిర్వచనీయమని మోదీ పేర్కొన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచే తన కంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని కొనియాడారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. కష్టపడే తత్వంతో పాటు స్నేహశీలి అయిన ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతులు గడించారన్నారు. రాజకీయాలకు సంబంధించి ఆయనకు లోతైన అవగాహన ఉందని మోదీ తెలిపారు.
PM Modi: దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి మోదీ పూజలు
సుశీల్ కుమార్ మోదీ బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2005 నుంచి 2013 వరకూ బిహార్ ఉప ముఖ్యమంత్రిగానూ.. 2017 నుంచి 2020 వరకూ బిహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు కూడా పని చేశారు. సుశీల్ కుమార్ మోదీ మరణంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. సుశీల్ కుమార్ మోదీ తన జీవితాన్ని బీహార్‌కు అంకితం చేశారన్నారు. బిహార్‌ను జంగిల్ రాజ్ నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడంలో సుశీల్ మోదీ కృషి ఎంతో ఉపయోగపడిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ యూకే టూర్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు..
ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..
Read Latest Telangana News and National News
Updated Date - May 14 , 2024 | 12:32 PM