ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swati Maliwal assault case: బిభవ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:24 PM

ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్‌ జ్యూడిషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది. అతడి జ్యుడిషియల్ కస్టడీ జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, జూన్ 22: ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడిషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది. అతడి జ్యుడిషియల్ కస్టడీ జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీస్ హజారీ కోర్టు ఎదుట బిభవ్ కుమార్‌ను పోలీసులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో తీస్ హజారీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


మే 13వ తేదీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మే 16వ తేదీన బిభవ్ కుమార్‌పై పోలీసులకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత మే 18న బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: సీఎం రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శం: నందమూరి బాలకృష్ణ


బిభవ్ కుమార్ బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపీ స్వాతి మలివాల్‌కు వచ్చిన బెదిరింపులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ క్రమంలో బిభవ్ కుమార్ బెయిల్ దరఖాస్తును తీస్ హజారీ కోర్టు కొట్టి వేసింది. ఇక సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి గురించి ఇండియా కూటమి నేతలకు ఎంపీ స్వాతి మలివాల్ లేఖలు రాశారు. ఈ సందర్బంగా సొంత పార్టీలోని నేతలు తనపై చేస్తున్న దుష్ఫ్రచారన్ని వారికి వివరించిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 22 , 2024 | 03:26 PM

Advertising
Advertising