ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముస్లింలతో మాట్లాడండి

ABN, Publish Date - Dec 08 , 2024 | 04:39 AM

దేశంలోని ముస్లింలతో మాట్లాడండి.. 1947లో కంటే అధ్వాన్న పరిస్థితుల్లో ఇప్పుడు మేమున్నాం.

ఉద్రిక్తతలను నివారించండి..మోదీకి ఢిల్లీ జామా మసీదు ఇమామ్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, డిసెంబరు 7: ‘దేశంలోని ముస్లింలతో మాట్లాడండి.. 1947లో కంటే అధ్వాన్న పరిస్థితుల్లో ఇప్పుడు మేమున్నాం. చొరవ తీసుకొని ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడండి’ అంటూ ప్రధాని మోదీని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ కోరారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లిం యువత ఓపికగా ఉండాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని మసీదుల్లో సర్వేలపై మతపర ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం జామా మసీదు వద్ద ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘1947లో కంటే అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాం. దేశంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మీరు కూర్చున్న కుర్చీకి న్యాయం చేయండి..ఉద్రిక్తతలు సృష్టించి దేశ వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న దుర్మార్గులను ఆపండి’ అని ఆయన మోదీని కోరారు.

Updated Date - Dec 08 , 2024 | 04:39 AM