ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రవాదుల్లో పాక్‌వాసులే అధికం

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:07 AM

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నిశితంగా కృషి చేస్తున్న భద్రత బలగాలు క్షేత్రస్థాయి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తంగా 119 మంది ఉగ్రవాదులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు నిఘా వర్గాలు

కశ్మీర్‌లో తగ్గుతున్న స్థానిక టెర్రరిస్టుల సంఖ్య

చురుగ్గా ఇంకా 119 మంది ఉగ్రవాదులు!

శ్రీనగర్‌, నవంబరు 12: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నిశితంగా కృషి చేస్తున్న భద్రత బలగాలు క్షేత్రస్థాయి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తంగా 119 మంది ఉగ్రవాదులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో 79 మంది పీర్‌ పంజాల్‌ ఉత్తర భాగంలో ఉన్నారు. వీరిలో 18 మంది స్థానికులు కాగా, 61 మంది పాక్‌ జాతీయులు. దక్షిణ భాగంలో 40 మంది ఉండగా వారిలో 34 మంది విదేశీయులు. ఆరుగురు స్థానికులు. ఈ ఏడాదిలో ఇంతవరకు 25 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది జవాన్లు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్లలో మొత్తం 61 మంది ఉగ్రవాదులు హతం కాగా, వారిలో 21మంది పాక్‌ జాతీయులు. ఉగ్రవాద ముఠాల్లో చేరడానికి స్థానికులు ఆసక్తి చూపించకపోవడంతో పాకిస్థాన్‌లోని నిరుద్యోగ, నిరక్షరాస్య యువతపై అవి దృష్టి పెట్టాయి. కాగా, పొరుగు దేశం నుంచి ఉగ్రవాద ముప్పు ఇంకా సవాలేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 06:07 AM