ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trending: ఆర్కెస్ట్రాలో చిగురించిన ప్రేమ.. ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు..

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:52 PM

ప్రేమకు కులమతాలు ఉండవు. ప్రాంతీయ బేధాలు అసలే ఉండవు. అంతే కాదండోయ్.. లింగభేదం కూడా లేదని

ప్రేమకు కులమతాలు ఉండవు. ప్రాంతీయ బేధాలు అసలే ఉండవు. అంతే కాదండోయ్.. లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ జెనరేషన్ కుర్రాళ్లు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక్కోసారి ట్రాన్స్‌జెండర్స్‌తోనూ ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్‌ జెండర్‌ పెళ్లిళ్లకు తెర లేపారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో జరిగింది. అవును, కొంతకాలంగా ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

పశ్చిమ బంగలోని 24 పరగణాలకు చెందిన జయశ్రీ.. ఓ ఆర్కెస్ట్రా బృందంలో పనిచేస్తోంది. ఆమెకు రాఖీదాస్ తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. దీర్ఘేశ్వరనాథ్‌ ఆలయానికి వెళ్లి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, తమకు వివాహం జరిపించాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరూ చట్టబద్ధమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారు. ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భగదా భవానీ ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకుని, ఏడడుగులు నడిచారు.

పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా ఒక్కటయ్యారన్న విషయాలను అక్కడివారితో పంచుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 12:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising