ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IT employees : ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్‌!

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:29 AM

కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు

బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారు ఓకే!

కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం

నేడు క్యాబినెట్‌ ఆమోదం.. తర్వాత అసెంబ్లీలో

ఉద్యోగుల సంఘం ఫైర్‌.. కార్మిక మంత్రితో భేటీ

మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి

ఐటీలో వారానికి 70 గంటలు పనిచేయాలని

గతంలో ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి సూచన

బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రైవేటు ఐటీ కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలివ్వాలంటూ బిల్లు తెచ్చిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు పనిగంటలను 14 గంటలకు పెంచేందుకు సిద్ధమైంది. దేశంలో అత్యధిక ఐటీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు బెంగళూరు, మైసూరు నగరాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. 14 పనిగంటల ప్రతిపాదనలను ఐటీ కంపెనీలు ఇటీవలే ప్రభుత్వానికి పంపాయి. సిద్దూ సర్కారు మరో ఆలోచన లేకుండానే వాటి అమలుకు సిద్ధమైంది. పని సమయాన్ని 14 గంటలకు పెంచుతూ.. కర్ణాటక షాప్స్‌, కమర్షియల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ బిల్లు-2024 (సవరణ)ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. సోమవారం కేబినెట్‌ భేటీలో చర్చించి.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవోలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను 12 నుంచి 14 గంటలకు పెంచాలని కార్మికశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పది గంటల వర్కింగ్‌ అవర్స్‌, రెండు గంటలు ఓవర్‌ టైం.. మొత్తం 12 గంటలు పనిచేస్తున్నారు. దీనిని 12 గంటల వర్కింగ్‌ అవర్స్‌, రెండు గంటల ఓవర్‌టైంకు సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ పని గంటలు వరుసగా మూడు నెలల్లో 125 గంటలకు మించరాదని పేర్కొన్నారు.

ఆ రెండు గంటల ఓవర్‌టైంకు జీతమివ్వరు. ఈ నిర్ణయంపై కర్ణాటక ఐటీ/ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (కేఐటీయూ) మండిపడింది. ఈ సవరణ బిల్లు చట్టమైతే మూడు షిఫ్టుల స్థానంలో రెండు షిఫ్టుల విధానం వస్తుందని.. ఐటీ రంగంలో పనిచేసే 20 లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందిని తీసేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతుందని, రెండు గంటలు అదనంగా పనిచేస్తే వారు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపింది. దీనిపై కార్మిక మంత్రి సంతో్‌షలాడ్‌, ఐటీబీటీ శాఖ అధికారులతో ఉద్యోగుల సంఘం కార్యదర్శి సుహాస్‌ అడిగ, అధ్యక్షుడు సూరజ్‌ నిడియం భేటీ అయ్యారు. కార్మికుడి వ్యక్తిగత జీవితాన్ని హరించేలా, ప్రాథమిక హక్కులను కాలరాసేలా నిబంధనలు తెస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లాడ్‌ స్పందిస్తూ.. నిర్ణయం తీసుకునేముందు మరోసారి చర్చిస్తామని తెలిపారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కొన్ని నెలల కిందట.. వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని, పలు దేశాల్లో ఇదే అమలు అవుతోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


సర్వేలు ఏం చెబుతున్నాయి..?

సుదీర్ఘకాలంపాటు పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో 45% మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఒత్తిళ్లకు లోనవుతున్నారని కర్ణాటక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌-ఇండస్ట్రీ్‌సతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు సంస్థలు చేసిన సర్వేలు తేల్చాయి. 55% మంది శారీరక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనీ వెల్లడైంది. వీరిలో 35% మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌, 17% మంది గుండెజబ్బుల బారిన పడతారని కూడా వెల్లడించాయి.

‘సినిమా’పైనా చూపు

బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక సినిమా, సాంస్కృతిక కళాకారుల బిల్లు-2024ను శాసనసభలో ఇటీవల ప్రవేశపెట్టింది. సినిమా టికెట్ల చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని సినీ కళాకారులు మండిపడుతున్నారు. సినిమా టికెట్లు, ఓటీటీ చార్జీలు పెంచడం ద్వారా ప్రేక్షకులపై భారం మోపనున్నారన్న విమర్శలు న్నాయి. సినిమా టికెట్లపై 2ు పన్ను పెంచి దోపిడీకి పాల్పడి ప్రజలకు వినోదాన్ని దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది.

Updated Date - Jul 22 , 2024 | 04:29 AM

Advertising
Advertising
<