Pinarayi Vijayan: రోడ్డు పక్కన కూర్చుని గవర్నర్ నిరసన...సీఎం రియాక్ట్
ABN, Publish Date - Jan 28 , 2024 | 02:24 PM
భారతీయ విద్యార్థి ఫెడరేషన్(SFI) నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం రోడ్డు పక్కన కూర్చుని నిరసన తెలిపిన తీరు గురించి కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.
భారతీయ విద్యార్థి ఫెడరేషన్(SFI) నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్(Arif Mohammad Khan) శనివారం రోడ్డు పక్కన కూర్చుని నిరసన తెలిపిన తీరుపై కేరళ సీఎం పినరయి విజయన్(pinarayi vijayan) స్పందించారు. ఈ క్రమంలో ఖాన్ చేసింది సరికాదని, భద్రతా నియమాలకు విరుద్ధమని అది తనకు తెలుసని విజయన్ అన్నారు. ఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం Z+ భద్రత కల్పిస్తోందని అన్నారు.
వీరంతా RSS కార్యకర్తలు, ఇప్పుడు ఖాన్ పేరు ఈ జాబితాలో చేర్చారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళలో సీఆర్పీఎఫ్ పాలన కొనసాగుతుందా అని ప్రశ్నించారు. సాయుధ దళాలు కేసులు కూడా నమోదు చేస్తాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ దళాలను మోహరించడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ పోలీసులతో పద్దతి ప్రకారం నడుచుకోవడం లేదని విజయన్ ఆరోపించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bihar Updates: రాజీనామా తరువాత నితీశ్ ఏమన్నారంటే..
శనివారం గవర్నర్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా SFI కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ క్రమంలో కేరళ పోలీసుల తీరుపై గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో గవర్నర్ తన కారును ఆపి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ నుంచి తెచ్చిన కుర్చీపై కూర్చుని వెంటనే పోలీసు కమిషనర్‌ను పిలవాలని తన కార్యదర్శి మోహన్‌ను కోరాడు. లేదంటే ప్రధానికి ఫోన్ చేయాలని అన్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్ళనని.. మీరు నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఖాన్ అన్నారు.
దాదాపు 90 నిమిషాల తర్వాత ఆందోళనకారులపై నాన్ బెయిలబుల్ అభియోగాల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గవర్నర్ లేచి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి వెళ్లిపోయారు. గవర్నర్ ఖాన్ నిరసన తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను CRPF Z+ భద్రతను కేటాయించింది. Z ప్లస్ సెక్యూరిటీ కవర్ CRPF అందించే అత్యున్నత స్థాయి భద్రతా రక్షణ. ఇందులో 10 NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలు, పోలీసులతో సహా 55 మంది సిబ్బంది ఉంటారు.
Updated Date - Jan 28 , 2024 | 02:24 PM