ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ratan Tata: వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..

ABN, Publish Date - Oct 10 , 2024 | 06:54 AM

రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా..

Ratan Tata

ప్రపంచంలో టాటా ఉత్పత్తుల పేరు చెప్పగానే గుర్తొచ్చేది రతన్ టాటా.. ఆయన నిరంతర ఆలోచన ఒకటే సామాన్యుడికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండాలన్నదే రతన్ టాటా ఆకాంక్ష. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా ఉన్న భారతదేశంలో వారి అభిరుచులను గుర్తించి.. ప్రతి వస్తువును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా సంస్థల ద్వారా ప్రయత్నించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అలా వ్యాపార రంగంలో దిగ్గజంగా ఎదిగిన రతన్ టాటా తన ప్రేమ జీవితంలో మాత్రం ఓడిపోయారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకోవడంతో పాటు ప్రజలందరి ప్రేమను పొందిన వ్యక్తి రతన్ టాటా. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించిన రతన్ టాటా నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తారు. బిజినెస్ టైకూన్‌గా ప్రపంచ దేశాల గుర్తింపు పొందిన రతన్ టాటా ప్రేమగాథను ఓసారి తెలుసుకుందాం.


రతన్‌ టాటా విఫల ప్రేమగాథ!

వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటా కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే.. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌- చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది.


ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్‌ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్‌ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 10 , 2024 | 06:54 AM