భరణం కోసం భార్య ఖాళీగా ఉండొద్దు
ABN, Publish Date - Sep 12 , 2024 | 05:21 AM
ఉన్నత చదువు, ఉద్యోగ అర్హత లుండి కూడా భార్య ఏ పని చేయకుండా కేవలం భర్త నుంచి వచ్చే భరణంపైనే ఆధారపడటం సరికాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. భరణం వస్తుంది కదా అని.. జీవనోపాధి కోసం సంపాదించుకోవడం ఆపేయడం సరికాదని
భోపాల్, సెప్టెంబరు 11: ఉన్నత చదువు, ఉద్యోగ అర్హత లుండి కూడా భార్య ఏ పని చేయకుండా కేవలం భర్త నుంచి వచ్చే భరణంపైనే ఆధారపడటం సరికాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. భరణం వస్తుంది కదా అని.. జీవనోపాధి కోసం సంపాదించుకోవడం ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించింది. నెలకు రూ.60 వేలు భరణంగా చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. రూ.60 వేల భరణం తనకు సరిపోదంటూ విచారణ సందర్భంగా భార్య కోర్టుకు తెలిపింది. దీనిపై భర్త వాదనలు వినిపిస్తూ.. ‘ఏ కారణం లేకుండానే నా భార్య విడిగా ఉంటోంది. ఆమె కూడా దుబాయ్‌లో బ్యాంకులో ఉద్యోగం చేసింది. బ్యూటీ పార్లర్‌తో ఇప్పుడు కూడా బాగానే సంపాదిస్తోంది. కాబట్టి భరణంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని తగ్గించండి’ అంటూ కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భరణాన్ని రూ.60 వేల నుంచి రూ.40 వేలకు తగ్గిస్తూ తీర్పు వెలువరిచింది.
Updated Date - Sep 12 , 2024 | 05:21 AM