ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హత్యాచారం కేసు సీబీఐకి!

ABN, Publish Date - Aug 14 , 2024 | 05:13 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి(31)పై అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన

దస్త్రాలన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి

కోల్‌కతా పోలీసులకు హైకోర్టు ఆదేశం

5 రోజులైనా కేసులో పురోగతి లేదని ధ్వజం

కోల్‌కతా, ఆగస్టు 13: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి(31)పై అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు మంగళవారం.. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సెమినార్‌ హాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆస్పత్రిలో ఉన్నవారికి తెలియకపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అసహజ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలపగా.. వైద్యురాలిని దారుణంగా హతమార్చితే వెంటనే హత్య కేసుగా ఎందుకు నమోదు చేయలేదని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. వైద్యురాలి మృతదేహం ఏమీ రోడ్డు పక్కన దొరకలేదని, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లేదా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరిగేలా చూడాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారించిన హైకోర్టు ధర్మాసనం.. పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్‌కతా పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు జరుపుతున్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా.. ఘటన జరిగి ఐదు రోజులైనా కోల్‌కతా పోలీసుల దర్యాప్తులో గుర్తించదగిన పురోగతి కనిపించలేదని వ్యాఖ్యానించింది. వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి, దీర్ఘకాలిక సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపడుతున్న నిరసనలపై స్పందిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత వైద్యులపై ఉన్నందున, ఆందోళనలను విరమించాలని సూచించింది. కాగా, జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు విధులు బహిష్కరించారు. తక్షణమే తగిన న్యాయం చేయాలని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలనూ నిలిపివేశారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది.

వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు

కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన నేపథ్యంలో జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) దేశంలోని వైద్య కళాశాలలకు మార్గదర్శకాలను జారీ చేసింది. వైద్య విద్యార్థులు.. ముఖ్యంగా విద్యార్థినులు క్యాజువాలిటీ, ఓపీ విభాగాలు, తమ క్వార్టర్స్‌(హాస్టల్స్‌)కు వెళ్లే మార్గాల్లో భద్రత కల్పించాలని సూచించింది. ఇందుకోసం ఆయా ప్రాంతా ల్లో లైటింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ‘‘సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. భద్రత కోసంమహిళా సిబ్బందిని కూడా నియమించాలి’’ అని కోరింది. మరోవైపు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఐఎంఏ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఏ చీఫ్‌ డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ మాట్లాడుతూ.. వైద్య కళాశాలల్లో హింసకు వ్యతిరేకంగా కేంద్ర చట్టం, ఎన్‌ఎంసీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 05:13 AM

Advertising
Advertising
<