అప్పుడలా ఇప్పుడిలా
ABN, Publish Date - Aug 15 , 2024 | 04:47 AM
చిత్రంలో ఎడమవైపు, కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీకి చెందిన ఈయన పదేళ్ల క్రితం 610కిలోల బరువు ఉండేవారు. ప్రపంచంలోనే అత్యంత లావైన, బరువైన వ్యక్తిగా రికార్డులకెక్కారు.
పదేళ్లలో 542కిలోల బరువు తగ్గిన సౌదీ వ్యక్తి
2013లో 610కేజీల బరువు.. ఇప్పుడు 63కిలోలు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: చిత్రంలో ఎడమవైపు, కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీకి చెందిన ఈయన పదేళ్ల క్రితం 610కిలోల బరువు ఉండేవారు. ప్రపంచంలోనే అత్యంత లావైన, బరువైన వ్యక్తిగా రికార్డులకెక్కారు. బాత్రూంకు వెళ్లాలన్నా అతనికి ఎవరో ఒకరి సాయం కావాల్సిందే. అధిక బరువుతో మూడేళ్లు బెడ్‌కే పరిమితం అయ్యారు. మోసెన్ పరిస్థితిని చూసి సౌదీ రాజు అబ్దుల్లా చలించిపోయారు. వైద్యం కోసం రియాద్‌లోని మెడికల్ సిటీలో ఏర్పాట్లు చేశారు. మోసెన్ కోసమే ప్రత్యేకంగా బెడ్ తయారు చేయించి, క్రేన్ సాయంతో అతన్ని అక్కడికి తరలించారు. అక్కడ 30 మంది వైద్యుల బృదం, మధ్యప్రాచ్యంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మోసెన్ బరువు తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్యాస్ట్రిక్ బైపాస్, స్కిన్ సర్జరీలు చేశారు. రోజూ ఫిజియోథెరఫీ చేయించేవారు. ప్రత్యేకమైన డైట్ రూపొందించి అందించేవారు. ఎలాగైతేనేం.. ఎట్టకేలకు మోసెన్ 542 కిలోల బరువు తగ్గిపోయారు. ఇప్పుడు 63.5 కిలోల బరువుతో ఇలా హాయిగా నవ్వుతున్నారు.
Updated Date - Aug 15 , 2024 | 04:47 AM