హిందూ జనాభా తగ్గుముఖం..
ABN, Publish Date - May 09 , 2024 | 04:38 AM
శంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిం దువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది.
1950-2015 మధ్య 8ు తగ్గుదల
మైనారిటీల జనాభాలో పెరుగుదల
ప్రధాని సలహామండలి అధ్యయనం
న్యూఢిల్లీ, మే8: దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిం దువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950-2015 మధ్యకాలంలో 7.8ు హిందువులు తగ్గిపోయినట్టు తెలిపింది. కానీ, మైనారిటీ జనాభా పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన వారిలో ముస్లిం లు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఉన్నట్టు తెలిపింది. జైనులు, పార్సీల జనాభా తగ్గుముఖం పట్టినట్టు పేర్కొంది.
ఇదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో అక్క డి మెజారిటీ జనాభా పెరిగినట్టు తమ అధ్యయనంలో తెలి పింది. 1950-2015 మధ్య ముస్లిం జనాభా వాటా 43.15ు పెరగ్గా, క్రిస్టియన్ జనాభా5.38ు, సిక్కులు6.58ు పెరిగినట్టు పేర్కొంది. బౌద్ధుల జనాభాలోనూ కొంత పెరుగుదల నమోదైనట్టు తెలిపింది.
హిందూ జనాభా విషయానికివస్తే 1950లో 84శాతం ఉన్న వీరు 2015నాటికి 78శాతానికి చేరి నట్టు పీఎం సలహా మండలి పేర్కొంది. గత 65ఏళ్లలో 9.84ు నుంచి 14.09శాతానికి ముస్లిం జనాభా పెరిగినట్టు తెలిపింది. మెజారిటీ జనాభా తగ్గుదలలో మయన్మార్ తొలిస్థానంలో ఉందని, ఇక్కడ 10ు మెజారిటీ జనాభా తగ్గిందని, తర్వాత స్థానంలో భారత్ ఉందని తెలిపింది. మూడోస్థానంలో ఉన్న నేపాల్‌లో మెజారిటీ హిందూ జనాభా 3.6ు తగ్గినట్టు పేర్కొంది. 167 దేశాల్లోని మెజారిటీ జనాభాపై చేసిన అధ్యయన వివరాలను పీఎం సలహా మండలి ఈ నెలలో విడుదల చేసింది. ‘‘భారత్‌లో మైనారిటీలకు రక్షణే కాకుండా వారి అభివృద్ధికీ ప్రభుత్వాలు దోహదపడుతున్నా యి’’అని నివేదిక పేర్కొంది. భారత్‌లో హిందూ జనాభా తగ్గ డం, మైనారిటీ జనాభా పెరగడానికి కారణాలు తెలియదని, కేవలం సంఖ్యాపరంగానే అధ్యయనం చేసినట్టు తెలిపింది.
Updated Date - May 09 , 2024 | 04:38 AM