ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జమ్మూ-కశ్మీర్‌ ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే: ఏడీఆర్‌

ABN, Publish Date - Oct 11 , 2024 | 07:18 AM

ఇటీవల జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేలలో మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. గురువారం అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌

ఇటీవల జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేలలో మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. గురువారం అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2014లో కూడా జమ్మూ- కశ్మీర్‌ అసెంబ్లీకి ముగ్గురు మహిళలే ఎన్నికవ్వడం గమనార్హం. ఏడీఆర్‌ తాజా నివేదిక ప్రకారం.. ఈసారి ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేలలో 76 మంది కోటీశ్వరులు ఉండగా, ఎమ్మెల్యేల ఆస్తుల సగటు విలువ రూ.11.43 కోట్లుగా ఉంది. ఆప్‌ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మెహ్రజ్‌ మాలిక్‌ ఆస్తి విలువ రూ.29 వేలు మాత్రమే. అలాగే తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన 4 ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, డీపీ, ఆప్‌లకు చెందిన చెరొక ఎమ్మెల్యేపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయి.

Updated Date - Oct 11 , 2024 | 07:18 AM