Shiv Sena: పూజా కేడ్కర్ ‘వ్యవహారం’పై స్పందించిన ఎంపీ
ABN, Publish Date - Jul 11 , 2024 | 07:18 PM
పుణె అసిస్టెంట్ కలెక్టర్ పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు గొంతెమ్మ కోర్కెల నేపథ్యంలో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో పూజా కేడ్కర్ వ్యవహారశైలిపై ఎంపీ మిలింద్ దేవరా గురువారం స్పందించారు.
ముంబై, జులై 11: పుణె అసిస్టెంట్ కలెక్టర్ పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగంతో పాటు గొంతెమ్మ కోర్కెల నేపథ్యంలో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో పూజా కేడ్కర్ వ్యవహారశైలిపై శివసేన (శిండే వర్గం) రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవరా ఎక్స్ వేదికగా గురువారం స్పందించారు. ఆమె వ్యవహారశైలి వల్ల ప్రజాసేవ ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సేవ చేయడానికి ప్రభుత్వంలో ఉన్నారా? లేకుంటే అర్హత భావం వల్లనా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Also Read: Peshawar: సౌదీ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Also Read: Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ
అయితే ట్రైనీ కలెక్టర్ పూజా కేడ్కర్‌పై తీవ్ర ఆరోపణలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. సమగ్ర విచారణ... అది కూడా నిష్పక్షపాతంగా జరపాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ సందర్భంగా ఆయన విజ్జప్తి చేశారు. ప్రజలకు నమ్మకం కలిగించడంలోపాటు న్యాయాన్ని సంరక్షించడంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని మిలింద్ దేవరా గుర్తు చేశారు. ప్రజాసేవ కోసం ఉన్నత స్థాయి అధికారులను తయారు చేయడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖ్యాతి గాంచిందని ఆయన పేర్కొన్నారు.
Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్ చాట్ వైరల్
Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం..
Also Read: Rajendra Nagar MLA: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..
పుణె అసిస్టెంట్ కలెక్టర్ పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అలాగే తనకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేసింది. అందుకు వాట్సప్‌లో చాట్ చేసింది. ఇక పుణె అడిషనల్ కలెక్టర్ లేని సమయంలో ఆయన కార్యాలయంలోని సామాగ్రిని ఆమె తొలగించింది. అలాగే ఆయన నేమ్ ప్లేట్ తీసివేసి.. ఆ స్థానంలో ఆమె నేమ్ ప్లేట్ పెట్టుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి పుణె జిల్లా కలెక్టర్ తీసుకు వెళ్లారు. దీంతో ఆమెను వాషిమ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కలెక్టర్‌గా ఎంపిక కావడం కోసం పూజా కేడ్కర్ నిబంధనలు సైతం అతిక్రమించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 07:18 PM