Mumbai: డ్యూటీలో ఉన్న రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురి దుర్మరణం
ABN, Publish Date - Jan 23 , 2024 | 02:21 PM
దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్‌పై పనులు జరుగుతున్న సమయంలో స్థానిక రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇటు అధికారులను, అటు రైల్వే సిబ్బందిని తీవ్రంగా కుదిపేసింది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్‌పై పనులు జరుగుతున్న సమయంలో స్థానిక రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇటు అధికారులను, అటు రైల్వే సిబ్బందిని తీవ్రంగా కుదిపేసింది.
రైలు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన వారిలో చీఫ్ సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్ వాసు మిత్ర, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ మైన్‌టెయినర్ సోమనాథ్ ఉత్తం లంబూత్రే, వాసవి రోడ్ అండ్ హెల్పర్ సచిన్ వాంఖడే ఉన్నారు. వీరంతా ముంబై డివిజన్ సిగ్నలింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్టు ఒక అధికార ప్రకటనలో వెల్లడించారు. డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందజేశారు. తక్షణ సాయంగా రూ.55,000 చొప్పున అందజేశారు. తక్కిన సాయాన్ని మరో 15 రోజుల్లో అందజేస్తామని ఆ ప్రకటన తెలిపింది. సచిన్ వాంఖడే, సోమనాథ్ కుటుంబాలకు సుమారు రూ.40 లక్షలు, వాసు మిత్ర కుటుంబానికి రూ.1.24 కోట్ల వరకూ సాయం అందుతుందని తెలిపింది. దీనికి అదనంగా, సెటిల్‌మెంట్ బకాయిలు (డీసీఆర్‌జీ, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్) కూడా మృతుల కుటుంబాలకు అందజేస్తారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తునకు పశ్చిమ రైల్వే ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Jan 23 , 2024 | 02:29 PM