ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : అసలు ధరకు మూడు రెట్లు!

ABN, Publish Date - May 25 , 2024 | 05:42 AM

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,

రూ.19 కోట్లకు కొని 53 కోట్లకు అమ్మారు

అదానీపై బొగ్గు కుంభకోణం బయటకు!

న్యూఢిల్లీ, మే 24: హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు, అవినీతి వార్తలను వెలికితీసే సంస్థ పదేళ్ల కిందటి అదానీ బొగ్గు కుంభకోణానికి సంబంధించి మరికొన్ని వివరాలను బయటపెట్టింది.

తక్కువ నాణ్యత బొగ్గును దిగుమతి చేసుకొని మూడురెట్ల ధరకు భారతీయ విద్యుత్‌ సంస్థలతో కొనిపించడం ఈ కుంభకోణంలో ప్రధాన అంశం. 2014 జనవరి నుంచి అక్టోబరు వరకు 24నౌకల్లో ఈ బొగ్గును తీసుకొచ్చి తమిళనాడు తీరంలోదించారు. బొగ్గును కొన్నపుడు టన్ను ధర 33.75డాలర్లుగా, నాణ్యత 3500కిలో కేలరీలకన్నా తక్కువగా పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వ విద్యుత్‌ సంస్థకు అమ్మేటప్పుడు మాత్రం టన్ను ధర 91.91 డాలర్లుగా, నాణ్య త 6000 కిలో క్యాలరీలుగా పేర్కొన్నారు.

రూ.19 కోట్లకు కొన్న బొగ్గును రూ.53 కోట్లకు తమిళనాడు ప్రభుత్వానికి అమ్మారనితేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సంఘటిత నేరాలు, అవినీతి వార్తలను వెలికితీసే సంస్థ సంపాదించింది. ఈ సంస్థ సమాచారం ఆధారంగా బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్‌ టైమ్స్‌, భారత్‌కు చెందిన హిందూ పత్రికలు అదానీ బొగ్గు కుంభకోణం వివరాలను బుధవారం కథనాలుగా రాశాయు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న డీఆర్‌ఐ పిటిషన్‌ను సత్వరమే విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన 21అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా లేఖ రాశాయి.

Updated Date - May 25 , 2024 | 05:42 AM

Advertising
Advertising