ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. సుప్రీం సంచలన నిర్ణయం

ABN, Publish Date - Oct 04 , 2024 | 11:27 AM

తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala Laddu controversy) ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Supreme Court

ఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala Laddu controversy) ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది.

సిట్ సభ్యులపై సందేహాల్లేవు..

ధర్మాసనం తీర్పు వెలువడక ముందు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు’’ అని తుషార్ మెహతా అన్నారు. ఈ మేరకు స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


కమిటీలో ఎవరెవరంటే..

కమిటీలో సీబీఐ, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి చెరో ఇద్దరు, ఫుడ్ సెఫ్టీ అథారిటీ నుంచి ఒకర్ని స్వతంత్ర సిట్‌లో ఏర్పాటు చేస్తూ కోర్టు నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో కమిటీ పని చేస్తుంది. కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది.


కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఓ టీవీ ఎడిటర్‌, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్‌) కొనసాగించాలా, లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అనంతరం ఇవాళ విచారించిన ధర్మాసనం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది.


రాష్ట్ర ప్రభుత్వానికే నివేదిక..

లడ్డూ కల్తీపై కొత్తగా నియమించిన స్వతంత్ర కమిటీ విచారణ ముగించిన తరువాత రాష్ట్రానికే నివేదికను అందజేయనున్నట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీలోనే ఎఫ్ ఐఆర్ దాఖలైనందున తుది నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికే స్వతంత్ర కమిటీ అందజేస్తుందంటున్నారు. ఇవాళ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై దాఖలైన నాలుగు పిటిషన్‌లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారనేది సీబీఐ డైరెక్టర్‌, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి డీజీపీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి ఆ సంస్థ ఛైర్మన్‌ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధర్మాసనం కల్పించింది. త్రిపాఠి నేతృత్వంలోని సిట్ స్థానంలో కొత్తగా అయిదుగురు సభ్యులతో స్వతంత్ర కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.

Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!

For Latest news and National news click here

Updated Date - Oct 04 , 2024 | 12:01 PM