ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajya Sabha polls: జర్నలిస్ట్ సాగరిక ఘోష్ సహా నలుగురి పేర్లు ఖరారు చేసిన టీఎంసీ

ABN, Publish Date - Feb 11 , 2024 | 08:41 PM

పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ కు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారంనాడు ప్రకటించింది. జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నేత సుస్మితా దేవ్, నదిముల్ హఖ్, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఖరారు చేసింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభ (Rajhya sabha)కు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆదివారంనాడు ప్రకటించింది. జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నేత సుస్మితా దేవ్, నదిముల్ హఖ్, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఖరారు చేసింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఈ నలుగురుని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అధికారిక 'ఎక్స్' ఖాతాలో టీఎంసీ పోస్ట్ చేసింది. భారతీయుల హక్కులకోసం పాటుపడే టీఎంసీ వారసత్వాన్ని పార్టీ తరఫున ఎన్నికైన అభ్యర్థులు నిలబెడతారని ఆశిస్తున్నామని తెలిపింది.


సాగరిక ఘోష్

ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, అవుట్ లుక్ మ్యాగజైన్, సీఎన్ఎన్-ఐబీఎన్ (ప్రస్తుతం సీఎన్న్-న్యూస్ 18) వంటి పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రింట్ జర్నలిజంతో పాటు టీవీ యాంకర్‌గా, పొలిటికల్ కామెంటరేటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ది జిన్ డ్రింకర్స్, బ్లెయిండ్ ఫెయిత్: ఇండియా అండ్ ది మిరేజ్ ఆఫ్ అర్బన్ మోడ్రనిటీ, వై ఐ యామ్ ఎ లిబరల్' తదితరల పుస్తకాలను రచించారు. టీఎంసీ, మమతా బెనర్జీతో సన్నిహత సంబంధాలు ఉన్నాయి.


సుస్మితాదేవ్..ఇతర అభ్యర్థులు

దివంగత మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె, మాజీ ఎమ్మెల్యే అయిన సుస్మితా దేవ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. గతంలో అసోంలోని సిల్చార్ నుచి లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత రాజ్‌దీప్ రాయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీఎంసీలో చేరడానికి ముందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాగా, నదీముల్ హఖ్‌కు టీఎంసీకి చెందిన ప్రముఖ ముస్లిం నేతగా పేరుంది. ప్రస్తుతం పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఎంసీలో మరో ప్రముఖ నేత మమత బాల ఠాకూర్. గతంలో బనగావ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.


రాజ్యసభ ఎన్నికలు

15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజ్యసభ స్థానాలకు, బీహార్‌-6, ఛత్తీస్‌గఢ్-1, గుజరాత్-4, హర్యానా-1, హిమాచల్ ప్రదేశ్-1, కర్ణాటక-4, మధ్యప్రదేశ్-5, మహారాష్ట్ర-6, తెలంగాణ-3, ఉత్తరప్రదేస్-10, ఉత్తరాఖండ్-1, పశ్చిమబెంగాల్-5, ఒడిశా-3, రాజస్థా్న్‌లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - Feb 11 , 2024 | 08:41 PM

Advertising
Advertising