ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: రాజీ కుదిరిందని కొట్టేయలేం: లైంగిక వేధింపుల కేసులో సుప్రీం కీలక తీర్పు

ABN, Publish Date - Nov 07 , 2024 | 01:17 PM

లైంగిక వేధింపుల కేసు నిందితుడికి సుప్రీం షాకిచ్చింది. బాధితురాలి కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పింది.

Supreme Court

ఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీం ధర్మాసనం కీలకతీర్పునిచ్చింది. ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ పడినంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం కొట్టివేసింది. ఫిర్యాదుదారు, నిందితులు కలిసి 'రాజీ' కుదుర్చుకున్నంత మాత్రాన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. ఇదే కేసులో నిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.


ఏమిటీ కేసు..?

2022 లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో ఈ కేసు నమోదైంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై మైనర్ దళిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని ప్రకారం కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా మైనర్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పలు సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టాన్ని కూడా ఉపయోగించారు. మైనర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.


బాధితులే చెప్పినా..

ఇటీవల నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు. అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, దానిని అంగీకరించిన హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

Donald Trump: బైడెన్‌తో బెడిసికొట్టిన స్నేహం.. ట్రంప్‌తో దోస్తీ.. మస్క్‌ది పెద్ద ప్లానింగే..


Updated Date - Nov 07 , 2024 | 01:25 PM