ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హీరోగా నిలిచినా.. తన పిల్లలను కోల్పోయాడు

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:01 AM

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న చాలా మంది శిశువులను కాపాడి హీరోగా మన్ననలు అందుకున్న యాకూబ్‌ మన్సూరీ..

ఝాన్సీ అగ్ని ప్రమాద ఘటనలో విషాదం

ప్రమాదం నుంచి చాలా మంది శిశువులను కాపాడిన యాకూబ్‌

పొగలో తన ఇద్దరు పిల్లల మృతి

ఝాన్సీ, నవంబరు 18: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న చాలా మంది శిశువులను కాపాడి హీరోగా మన్ననలు అందుకున్న యాకూబ్‌ మన్సూరీ.. తన కవల పిల్లలను మాత్రం రక్షించుకోలేక పోయాడు. తాను రక్షించిన పిల్లల తల్లిదండ్రులు అతనికి కృతజ్ఞతలు చెపుతుంటే.. అతను మాత్రం కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన తన పిల్లలను తలచుకుని కుమిలిపోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో లక్ష్మీబాయి ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద విషాద ఘటన వివరాలను యాకూబ్‌ మీడియాకు వివరించాడు. ‘‘ఈనెల 9న పుట్టిన నా కవల పిల్లలకు శ్వాసలో ఇబ్బంది వచ్చింది. వారిని ఝాన్సీ ఆస్పత్రిలో చేర్చాం. రాత్రి అగ్ని ప్రమాదం గుర్తించి ఎస్‌ఎన్‌సీయూ లోపలి యూనిట్‌ నుంచి ఓ మహిళ అరవడంతో సడెన్‌గా నిద్ర నుంచి లేచాం. ఆ యూనిట్‌ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాం. అయితే వెళ్లడానికి దారిలేక కిటికీ పగలగొట్టాల్సి వచ్చింది. లోపల చాలా వేడిగా ఉండటమే కాకుండా పూర్తి పొగ కమ్మేసింది. నా బావమరిదితో కలసి లోపల ఉన్న ఒక్కో శిశువును జాగ్రత్తగా కిటికీలోంచి బయటకు తీసుకువచ్చాం. ఆ చిన్న గదిని విపరీతంగా పొగ కమ్మేయడంతో నా పిల్లలను గుర్తించే అవకాశం లేదు. పొగ ఘాటుకు మేం వాంతులు చేసుకున్నాం. ఇక ఆ చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు? అందుకే చనిపోయారు. నా పిల్లలను పోస్టుమార్టంలో చూడటం భరించలేని విషయం’’ అని తెలిపాడు. ఈ ప్రమాదంలో 11 మంది శిశువులు చనిపోయారు.

Updated Date - Nov 19 , 2024 | 02:01 AM