ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేసులో ట్రంప్‌ ముందంజ!

ABN, Publish Date - Oct 26 , 2024 | 02:34 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొన్నా..

  • మాజీ అధ్యక్షుడికి 48% మంది మద్దతు.. సీఎన్‌బీసీ సర్వే

  • ట్రంప్‌ గెలిస్తే భారత్‌కు ఐటీ కష్టాలు!

న్యూఢిల్లీ, అక్టోబరు 25: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొన్నా.. రేసులో ట్రంప్‌ కాస్త ముందంజలో ఉన్నారట! మరో రెండు వారాల్లో అధ్యక్ష ఎన్నికలకు తెరలేవనున్న నేపథ్యంలో సీఎన్‌బీసీ సంస్థ ‘ఆల్‌-అమెరికన్‌ ఎకనామిక్‌ సర్వే’లో ఇది తేలింది. అక్టోబరు 15-19 మధ్య ఈ సర్వే జరిపారు. అమెరికా వ్యాప్తంగా 1000 మంది ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు ట్రంప్‌కు 48%, కమలా హారి్‌సకు 46% మంది మద్దతు పలికారు. అయితే ఇది 3.1శాతం అటూ ఇటూ కావొచ్చని సర్వే సంస్థ పేర్కొంది. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తే మన దేశానికి ఐటీ పరంగా కష్టాలు ఎదురవుతాయని ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఆయన విజయం సాధిస్తే ఇప్పుడున్న వీసా నిబంధనలు కఠినంగా మారతాయని, ఫలితంగా భారత ఐటీ కంపెనీలకు సవాళ్లు ఎదురవుతాయని ఆ కంపెనీ పేర్కొంది.

Updated Date - Oct 26 , 2024 | 02:34 AM