'రామ్‌లీల' ప్రదర్శనను అవకాశంగా తీసుకుని జైలు నుంచి పరారైన ఖైదీలు
ABN, Publish Date - Oct 12 , 2024 | 07:54 PM
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న రోషనాబాద్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దీంతో ఉలిక్కిపడిన అధికారులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని డెహ్రాడూన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న రోషనాబాద్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దీంతో ఉలిక్కిపడిన అధికారులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఖైదీల కోసం రామ్‌లీలా ప్రదర్శనకు జైలులో శుక్రవారం ఏర్పా్ట్లు చేశారు. ఇదే అవకాశంగా తీసుకున్న ఇద్దరు ఖైదీలు ఆవరణలో నిర్మాణ కార్మికులు వదిలేసిన ఒక నిచ్చెన సాయంతో గోడపైకి ఎగబాకి అక్కడి నుంచి తప్పించుకున్నారు. వీరిరువురు వానరుల వేషంలో సీతను గాలిస్తున్నట్టు గాలిస్తూ అట్నించి అటే పరారయ్యారని తెలుస్తోంది. వీరిలో హత్యానేరం కింద యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ, అపహరణ కేసుపై విచారణను ఎదుర్కొంటున్న మరో ఖైదీ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
MEA: బంగ్లాలో హిందూ ఆలయాలపై దాడులు.. ఎంఈఏ తీవ్ర ఆక్షేపణ
పరారైన ఖైదీల్లో రూర్కీకి చెందిన పంజక్ కుమార్, ఉత్తరపప్రదేశ్‌లోని గోండాకు చెందిన రామ్ కుమార్ ఉన్నారని హరిద్వార్ ఎస్ఎస్‌పీ ప్రమేంద్ర దోబల్ చెప్పారు. పంకజ్ కుమార్ హత్యా నేరం కింద యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడని, రామ్ కుమార్ విచారణ ఖైదీ అని తెలిపారు. జైలులో బ్యారక్‌ల నిర్మాణం జరుగుతుండటంతో నిచ్చెనను కార్మికులు వదిలివెళ్లినట్టు చెప్పారు.
కాగా, ఖైదీలు పరారైన విషయం శనివారం ఉదయం 8 గంటల వరకూ గుర్తించలేదని సమాచారం. రొటీన్‌గా ఖైదీల లెక్కింపు ఉదయం 6.30 గంటలకు జరిగినప్పుడు ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పోయినట్టు గుర్తించారని దోబల్ చెప్పారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సాధ్యమైనంత త్వరలో ఖైదీలను పట్టుకుంటామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగినా ఆ విషయం గుర్తించడంలో జరిగిన జాప్యంపై విచారణ జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. కాగా, ఘటన జరిగిన సమయంలో జైలర్ మనోజ్ ఆర్య సెలవుపై ఉండటంతో ఆయన వెంటనే స్పందించలేదు.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..
Haryana: హర్యానాలో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీలో ట్విస్ట్
Updated Date - Oct 12 , 2024 | 07:57 PM