ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు.. వొరెనెజ్‌లో ఎమర్జెన్సీ

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:06 AM

రష్యా దాడులను ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో రష్యాలోని వొరొనెజ్‌లో మందుగుండు డిపోలో మంటలు చెలరేగాయి. దీంతో ఆదివారం వొరొనెజ్‌ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మోదీ రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందు ఘటన

మాస్కో, జూలై 7: రష్యా దాడులను ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో రష్యాలోని వొరొనెజ్‌లో మందుగుండు డిపోలో మంటలు చెలరేగాయి. దీంతో ఆదివారం వొరొనెజ్‌ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఉక్రెయిన్‌ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వొరొనెజ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ గుసేవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పాడ్గొరెన్‌స్కీ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడిని కొనసాగిస్తోందని.. మందుగుండు డిపోలో మంటలు చెలరేగాయని తెలిపారు. కాగా, భారత్‌-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం నుంచి రెండ్రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 2019 తర్వాత మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

Updated Date - Jul 08 , 2024 | 05:06 AM

Advertising
Advertising
<