ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి

ABN, Publish Date - Nov 05 , 2024 | 08:26 PM

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ఆనంద్: గుజరాత్‌‍లోని ఆనంద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు (Bullet Train Projest)లో భాగంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మంగళవారంనాడు కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

US Elections 2024: కమలా హారిస్ గెలుపు కోసం స్వగ్రామంలో ప్రత్యేక పూజలు


నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇద్దరు కార్మికులను రక్షించారని, మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారని ప్రాథమిక సమాచారం.


కాగా, మహి నది వద్ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు స్థలంలో కాంక్రీట్ బ్లాక్‌ల మధ్య ముక్కురు కార్మికులు చిక్కుకుపోయారని, క్రేన్లు, ఎక్స్కవేటర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని 'నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్' సామాజిక మాధ్యమం "ఎక్స్''లో తెలిపింది. ఒక కార్మికుడిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. కాగా, నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలడంపై అధికారులు విచారణ ప్రారంభించారు. నిర్మాణ సంబంధిత కారణాల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ, పూర్తి విచారణ అనంతరమే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


ముంబై-అహ్మదాబాద్‌ను కలిపే ఈ హైప్రొఫైల్ బుల్లెట్ ప్రాజెక్టులో భాగంగానే ఈ వంతనె నిర్మాణం జరుగుతోంది. భారతదేశ రైల్వే చరిత్రలోనే రివల్యూషనరీ ప్రాజెక్టుగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును భావిస్తుండగా, భూసేకరణకు సంబంధించిన పలు వివాదాలతో సహా అనేక సవాళ్లతో నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది.


Also Read:

ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన

మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

For More National and telugu News

Updated Date - Nov 05 , 2024 | 08:28 PM