ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరింపులు
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:34 AM
ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ గుర్తుతెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.
ముంబై, డిసెంబరు 7: ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ గుర్తుతెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. బాంబు పేలుడు ద్వారా మోదీని చంపేందుకు ఇద్దరు ఐఎ్‌సఐ ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఈ మేరకు శనివారం ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాట్సాప్ నంబరు ఆధారంగా రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు గుర్తించామని, ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడి పంపామని తెలిపారు. అయితే నిందితుడి మానసిక పరిస్థితి నిలకడగా లేకపోవడమో లేదా మద్యం తాగిన మత్తులో ఈ పని చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, రూ.50లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్‌ను అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో బెదిరింపు సందేశం పంపించాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ప్రేమ్‌శంకర్‌కు, ఆయన తండ్రి గోపీనాథ్‌కు ఇలాగే రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపు సందేశం పంపిన కేసులో రాజ్‌కుమార్ సింగ్ అనే వ్యక్తిపై గతనెలలో యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Dec 08 , 2024 | 04:34 AM