Yogi Cabinet Expansion: యోగి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు...
ABN, Publish Date - Mar 04 , 2024 | 08:09 PM
లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఈనెల 5వ తేదీ మంగళవారం ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాల సమాచారం. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanth) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఈనెల 5వ తేదీ మంగళవారం ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాల సమాచారం. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. ఎస్‌బీఎస్‌బీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్‌డీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ శాసన మండలి సభ్యుడు ధారాసింగ్ చౌహాన్‌లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఎల్‌డీ నేత రాజ్‌పాల్ బల్యాన్, ఓపీ రాజ్‌భర్, చౌహాన్‌లు మంత్రులుగా యోగి క్యాబినెట్‌లో చేరుతారు. బీజేపీ నేత ఆకాష్ సక్సేనా, ఆర్ఎల్‌డీ నేత ప్రదీప్ చౌదరి సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత అక్టోబర్ నుంచి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.
Updated Date - Mar 04 , 2024 | 09:09 PM