Ayodhya: అయోధ్యలో సరికొత్త టెక్నాలజీ వినియోగం..అలా వస్తే నో ఎంట్రీ
ABN, Publish Date - Jan 13 , 2024 | 04:28 PM
అయోధ్య(Ayodhya)లో రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాడులు, చొరబాట్లను అడ్డుకునేందుకు రామజన్మభూమి ప్రాంతం 24 గంటలూ ఫూల్‌ప్రూఫ్ భద్రతతో నిమగ్నమవుతోంది.
అయోధ్య(Ayodhya)లో రామమందిర(ram mandir) ప్రతిష్ఠాపనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాడులు, చొరబాట్లను అడ్డుకునేందుకు రామజన్మభూమి ప్రాంతం 24 గంటలూ ఫూల్‌ప్రూఫ్ భద్రతతో నిమగ్నమవుతోంది. అందుకోసం రూ.90 కోట్ల విలువైన హైటెక్ పరికరాలు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఏదైనా దాడి నుంచి రక్షించడానికి రూపొందించబడిన క్రాష్ రేటెడ్ బొల్లార్డ్‌లు, జన్మభూమి మార్గం గుండా వెళుతున్న రహదారిపై ఏదైనా వాహనాన్ని గుర్తించే అండర్ వెహికల్ స్కానర్‌లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు రిమోట్ ఆపరేటెడ్ బూమ్ బారియర్స్, ముడుచుకునే మెటాలిక్ గేట్లు కూడా సిద్ధం చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Lakshadweep: లక్షద్వీప్‌కు అలయన్స్ ఎయిర్ మరిన్ని విమానాలు..మూన్నేళ్ల వరకు నో టిక్కెట్స్!
CCTV నిఘా వ్యవస్థ, యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, క్రాష్ రేటెడ్ బోలార్డ్స్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, భద్రతా సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, నైట్ విజన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ డివైజ్‌లు, D ఆర్మర్ డిస్‌రప్టర్ సహా అనేక పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు అయోధ్య ప్రాంతాన్ని ఎల్లో జోన్, రెడ్ జోన్‌లుగా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను విభజిస్తూ అన్ని కెమెరాల ఫీడ్ స్టోర్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతోపాటు సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ల నుంచి వ్యక్తులు వచ్చే క్రమంలో ప్రసాదం లేదా ఇతర బహుమతి లాంటి వస్తువులను తీసుకెళ్లడం అనుమతించబడదని అధికారులు అన్నారు. వాటిని లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్స్(smart phones), స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్‌లు, బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు లేదా వ్యక్తిగత ఆరోగ్య గాడ్జెట్‌లతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు జనవరి 22న సెక్యూరిటీ గేట్‌ల నుంచి అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు.
Updated Date - Jan 13 , 2024 | 04:29 PM