Viral News: మహిళల బట్టలు మగవాళ్లు కుట్టకూడదు.. మహిళా కమిషన్ కొత్త ప్రతిపాదన
ABN, Publish Date - Nov 08 , 2024 | 03:38 PM
ఆడవారిని అసభ్యంగా తాకడం, చేతులు వేయడం వంటి వేధింపులను అడ్డుకునేందుకు యూపీ మహిళా కమిషన్ కొత్త రూల్ తేనుంది.
లక్నో: మహిళల బట్టలను పురుషులు కుట్టకుండా నిరోధించాలని ఉత్తర్ ప్రదేశ్ మహిళా కమిషన్ ప్రతిపాదన తీసుకొచ్చింది. అంతే కాదు మహిళల జట్టు కత్తిరించే దగ్గర కూడా పురుష ఉద్యోగులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. అవసరమైతే ఇలాంటి ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని సూచించింది. ఇంతకీ ఇన్ని జాగ్రత్తలు దేని కోసం అంటే.. మహిళలను ‘బ్యాడ్ టచ్’ నుంచి రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం అని తెలిపింది.
అక్టోబరు 28న జరిగిన మహిళా కమిషన్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మహిళలు బట్టల కొలతలను మహిళా టైలర్లు మాత్రమే తీసుకోవాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చిందని మహిళా సంఘం సభ్యురాలు హిమానీ అగర్వాల్ తెలిపారు.
మహిళలు ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే వేధింపులకు గురవుతున్నట్టు గుర్తించామన్నారు. టైలర్ షాపులు, సెలూన్ల వంటి వాటిల్లో ఆడవాళ్లు ఎక్కువగా వెళ్లే చోట మగవాళ్ల ధోరణి సరిగా ఉండటం లేదన్నారు. అయితే, ఈ విషయంలో అందరు మగవాళ్లను తప్పుపట్టలేమన్నారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ ఇటువంటి నిబంధనలు తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
Viral video: వీధి రౌడీల్లా మారిన మహిళలు.. కర్రలతో చితక్కొట్టుకున్నారు
Updated Date - Nov 08 , 2024 | 03:38 PM