ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VK Pandian: బీజేపీ సెల్ఫ్ గోల్.. బీజేడీకీ లాభం

ABN, Publish Date - May 28 , 2024 | 04:21 PM

ఒడిశాలో అధికారం అందుకోవడం కోసం బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని.. అయితే అది తమ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేడీ నాయకుడు వీకే పాండ్యన్ వెల్లడించారు. ఒడిశాలో వరుసగా ఆరోసారి బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

భువనేశ్వర్, మే 28: ఒడిశాలో అధికారం అందుకోవడం కోసం బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని.. అయితే అది తమ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేడీ నాయకుడు వీకే పాండ్యన్ వెల్లడించారు. ఒడిశాలో వరుసగా ఆరోసారి బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిని ఏ ఒక్కరు ఆపలేరని పాండ్యన్ ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో గెలుపు కోసం బీజేపీ చేస్తున్న సెల్ఫ్ గోల్‌లను ఈ సందర్బంగా ఆయన వివరించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో మంచి మెజార్టీ వస్తుందన్నారు. ఈ మెజార్టీతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక చివరి దశ పోలింగ్‌.. తమ పార్టీ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం చేసిన 9 సెల్ఫ్ గోల్స్‌ను బీజేడీ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ సలహాదారు వీకే పాండ్యన్ విశదీకరించారు.

రాష్ట్రానికి అయిదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నవీన్ పట్నాయక్‌‌ను అభ్యంతరకర భాషలో బీజేపీ నాయకులు మాట్లాడారన్నారు. నవీన్ పట్నాయక్‌లాంటి వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు హర్షించరని తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుడి పేరు సైతం ఆ పార్టీ నేతలు వాడుకున్నారని గుర్తు చేశారు.


బీజేపీ అధికారంలోకి వస్తే.. మిషన్ శక్తిని తొలగిస్తామన్నారని చెప్పారని.. దీంతో ఈ పథకంలో ఉన్న 70 లక్షల మంది మహిళ సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పారు. ఆ క్రమంలో మహిళలు భయాందోళనకు గురవుతారని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే.. బిజు స్వస్తీయ కల్యాణ్ యోజన పథకాన్ని రద్దు చేసి.. ఆయుష్మన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామని బీజేపీ ప్రకటించిందని గుర్తు చేశారు.

PM Modi: నవీన్‌ బాబుతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదో వెల్లడించిన మోదీ

కానీ బీజేపీ తీసుకు వచ్చిన ఆయుష్మన్ భారత్ పథకం కేవలం దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారి కోసమేనని చెప్పారు. కానీ బీజేడీ తీసుకు వచ్చిన బిజు స్వస్తీయ కల్యాణ్ యోజన పథకంతో ఒడిశాలోని 90 శాతం మందికి లబ్ది చేకూరుతుందని పాండ్యన్ గుర్తు చేశారు. బిజు ప్రభుత్వం విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చిందని.. అదే బీజేపీ అధికారంలోకి వస్తే.. వాటినన్నింటిని పక్కన పెట్టేస్తుందన్నారు. అంతేకాదు విద్యార్థులకు తమ ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్ షిప్‌లను సైతం రద్దు చేస్తుందని పేర్కొన్నారు.


రాష్ట్రంలో షెడ్యుల్ తెగల సంస్కృతి, భాషల కోసం బీజేడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపట్టిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. వాటన్నింటిని బీజేపీ రద్దు చేస్తుందన్నారు. అంతేకాదు ఒడిశా ప్రజల మధ్య ఉన్న మత సామరస్యాన్ని సైతం బీజేపీ దెబ్బ తీస్తుందని పాండ్యన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్నట్లు డబుల్ ఇంజిన్ సర్కార్‌ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో.. రేపు ఒడిశాలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుదన్నారు.

Karnataka: మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

వరికి క్వింటాకు కనీస మద్దతు ధరగా బీజేపీ రూ. 3,100 ప్రకటించిందని.. అయితే గతంలో ఈ కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం జోక్యం చేసుకుందా? అని వీకే పాండ్యన్ ప్రజలను ప్రశ్నించారు. ఇక పట్నాయక్ ప్రభుత్వం రాష్ట్రంలోని 90 శాతం మందికి ఉచిత విద్యుత్ అందిస్తామంటూ ప్రకటన చేయడంతో.. బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 06:16 PM

Advertising
Advertising