ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajya Saba Elections: ఆ ఒక్క సీటు కోసం బీజేపీ, ఎస్పీ హోరాహోరీ.. గెలుపెవరిది..?

ABN, Publish Date - Feb 26 , 2024 | 05:19 PM

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) మంగళవారంనాడు జరుగనున్నాయి. అదనపు సీటు కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే, సమాజ్‌వాదీ (SP) పార్టీ మధ్య నెలకొంది. మొత్తం 10 సీట్లలో ఎన్నికలు జరుగుతుండగా, 11 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది.

లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) మంగళవారంనాడు జరుగనున్నాయి. అదనపు సీటు కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే, సమాజ్‌వాదీ (SP) పార్టీ మధ్య నెలకొంది. మొత్తం 10 సీట్లలో ఎన్నికలు జరుగుతుండగా, 11 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది. 10వ సీటును ఎవరు దక్కించుకోనున్నారనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. బలాబలాల ఆధారంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు, ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమైంది. బీజేపీ అదనంగా ఒక అభ్యర్థిని బరిలోకి దింపడంతో పదో సీటు కోసం పోటీ తప్పనిసరి అయింది. ఒక్కో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 37 చొప్పున ఓట్లు అవసరమవుతాయి.


నెంబర్ గేమ్..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా, 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ ఎనిమిదో సీటును గెలుచుకోవాలంటే మరో 9 మంది సభ్యుల ఓట్లు అవసరమవుతారు. ఎన్డీయేకు (బీజేపీ, ఆర్ఎల్‌డీ, అప్నాదల్ ఎస్, నిషాద్ పార్టీ, ఎస్‌పీబీఎస్‌పీ, జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) 288 మంది లెజిస్లేటర్లు ఉన్నారు. అయితే, ఎస్‌బీఎస్‌పీకి చెందిన ఒక ఎమ్మెల్యే జైలులో ఉండటంతో వారి బలం 287కి పడిపోయింది. ఇటీవలే బీజేపీలో చేరిన రితీష్ పాండే తన తండ్రి రాకేష్ పాండే ఓటును బీజేపీకి అనుకూలంగా వేయించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. రాకేష్ పాండే సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్రకారం బీజేపీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.


మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ మూడో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే వారికి కేవలం మూడు ఓట్లు అవసరమవుతాయి. ఎస్పీ, కాంగ్రెస్ కలిపి 110 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎస్‌పీ ఎమ్మెల్యేలు రామాకాంత్ యాదవ్, ఇర్ఫాన్ సోలంకి జైలులో ఉన్నారు. ఆ ప్రకారం ఎస్పీకి మరో ముగ్గురు లెజిస్లేటర్ల అవసరం ఉన్నారు. ఎస్పీ ఎమ్మెల్యే రాకేష్ పాండే కనుక బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే మాత్రం నాలుగు ఓట్లు అదనంగా ఎస్పీకి అవసరమవుతాయి. ఈ క్రమంలో పదో సీటును ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రస్తుతం 'క్రాస్ ఓటింగ్‌' పైనే అందరి దృష్టి ఉంది.

Updated Date - Feb 26 , 2024 | 05:19 PM

Advertising
Advertising