రూ.5 కోట్లు చెల్లించాలని సల్మాన్‌కు హెచ్చరిక
ABN, Publish Date - Oct 19 , 2024 | 03:29 AM
హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో బెదిరింపు మెసేజ్ పంపించింది.
ముంబై, అక్టోబరు 18: హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో బెదిరింపు మెసేజ్ పంపించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో వైరం వద్దనుకుంటే రూ.5 కోట్లు చెల్లించాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించింది. ఈ మేరకు ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ అందింది. ‘‘దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వాన్ని ముగించాలన్నా తప్పకుండా రూ.5 కోట్లు చెల్లించాలి. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఇటీవలే హత్యకు గురయిన బాబా సిద్దిఖీకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని ఆ మెసేజ్‌లో పేర్కొంది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంద్రాలోని సల్మాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. సల్మాన్‌కు గతంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
Updated Date - Oct 19 , 2024 | 03:29 AM