ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washington : 2034 నాటికి ఉద్యోగాల తీరే మారిపోతుంది!

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:35 AM

మరో పదేళ్లలో.. 2034 నాటికి సంప్రదాయ పని వేళలు (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 తరహా) ఉండవని.. ఉద్యోగాలు, పనివేళలు పూర్తిగా మారిపోతాయని ప్రఖ్యాత

  • సంప్రదాయ పనివేళలు ఉండవు

  • లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు హాఫ్‌మన్‌

వాషింగ్టన్‌, జూలై 26: మరో పదేళ్లలో.. 2034 నాటికి సంప్రదాయ పని వేళలు (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 తరహా) ఉండవని.. ఉద్యోగాలు, పనివేళలు పూర్తిగా మారిపోతాయని ప్రఖ్యాత ఆన్‌లైన్‌ సేవల సంస్థ లింక్‌డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్‌మన్‌ అంచనా వేశారు. కృత్రిమే మేధో (ఏఐ) రంగంలో చోటు చేసుకునే మార్పులతో గిగ్‌ ఎకానమీ అనూహ్యంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు.

వ్యక్తులు డిమాండ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు సేవలు అందించి డబ్బులు సంపాదించుకోవటం, శాశ్వత ఉద్యోగాలనే భావన మటుమాయం కావటం గిగ్‌ ఎకానమీ లక్షణాలు. ఈ తరహా ఆర్థిక వ్యవస్థ విస్తరించి, వ్యక్తులు ఒకే రంగానికి పరిమితం కాకుండా వేర్వేరు రంగాలలో తమకు నచ్చిన పనులు (ఉద్యోగాలు) చేస్తుంటారని, కాబట్టి, ఆఫీసుకు వెళ్లటం, ఓ నిర్దిష్ట సమయంలో పని చేయటం అనే పరిస్థితులు క్రమంగా అంతరించిపోతాయని హాఫ్‌మన్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 06:47 AM

Advertising
Advertising
<