Samajwadi Party MP: సభలో జయా బచ్చన్ ‘అసహనం’
ABN, Publish Date - Jul 30 , 2024 | 12:46 PM
బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చాలా కామ్ గోయింగ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా సాదా సీదాగా ఉంటారు. దేశంలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన అమితాబ్ భార్యగా నిత్యం వార్తల్లో ఉండాలని ఆమె ఏ మాత్రం భావించరు. సరికదా.. అందుకు తగినట్లుగానే ఆమె వ్యవహార శైలి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
న్యూఢిల్లీ, జులై 30: బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ చాలా కామ్ గోయింగ్‌గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా సాదా సీదాగా ఉంటారు. దేశంలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన అమితాబ్ భార్యగా నిత్యం వార్తల్లో ఉండాలని ఆమె ఏ మాత్రం భావించరు. సరికదా.. అందుకు తగినట్లుగానే ఆమె వ్యవహార శైలి ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
Also Read: Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి
పెద్దల సభ వేదికగా...
అయితే అలాంటి జయాబచ్చన్.. అందుకు విరుద్దంగా వ్యవహరించారు. అందుకు పెద్దల సభ.. రాజ్యసభ వేదిక అయింది. సోమవారం రాజ్యసభలో న్యూఢిల్లీలో సివిల్స్ ఆశావహులు ముగ్గురు మృతి అంశంపై చర్చ వాడి వేడిగా జరుగుతుంది. ఆ క్రమంలో రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ స్థానంలో ఉన్న హరివంశ నారాయణ్ సింగ్.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ మీరు మాట్లాడండంటూ జయా బచ్చన్‌ను పిలిచారు. ఆ వెంటనే.. తన స్థానంలో నుంచి లేచి తనను జయా బచ్చన్ అని పిలవండి చాలంటూ హరివంశ నారాయణ్ సింగ్‌కు ఆమె విజ్జప్తి చేశారు.
Also Read: Jharkhand train accident: ఇదా నా పాలన.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత
అలా అయితేనే మహిళకు గుర్తింపు వస్తుందా?.. జయాబచ్చన్ ఫైర్..
దీంతో హరి వంశ నారాయణ్ సింగ్ స్పందిస్తూ.. పార్లమెంట్ రికార్డుల్లో మీ పేరు.. శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ అని రాసి ఉందని.. దానినే తాను సంభోదించానని ఆమెకు స్పష్టం చేశారు. అందుకు ప్రతిగా జయా బచ్చన్ ఇలా స్పందించారు.. ఇది చాలా కొత్తగా ఉందన్నారు. భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. వాళ్లు స్వంతంగా ఏమీ సాధించలేరా? అంటూ జయా బచ్చన్ రాజ్యసభలో తన కోపాన్ని బయట పెట్టారు.
Also Read: Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు
రాజకీయం చేయకండి..
అనంతరం ఆమె కాస్తాంత చల్ల బడ్డారు. ఆ క్రమంలో ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మరణం చాలా బాధాకారమన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయకండి అంటూ రాజ్యసభలో జయా బచ్చన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు వరద నీరు వచ్చి చేరింది. దాంతో రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో ముగ్గురు సివిల్స్ ఆశావహులు నీట మునిగి మరణించారు.
Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వ వైఖరి వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ ఘటనపై చర్చ వాడి వేడిగా నడుస్తుంది.
Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 30 , 2024 | 12:48 PM