ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Narendra Modi: మళ్లీ పగ్గాలు చేపట్టాక పూర్తి స్థాయి బడ్జెట్: మోదీ

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:31 PM

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్‌ సమర్పణ ఉంటుంది.

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ (Full fledged Budget)ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటం, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్‌ సమర్పణ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించనుంది.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. బడ్జెట్‌కు ముందు రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సిన ఎకనామిక్ సర్వేను ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో సభలో ప్రవేశపెట్టడం లేదు. బుధవారంనాడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రసంగం చేయడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక బడ్జెట్‌లో ప్రధానంగా మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని కేంద్రం రెట్టింపు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే వీలుంది.

Updated Date - Jan 31 , 2024 | 03:31 PM

Advertising
Advertising