ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: బనారస్ చీరలపై అయోధ్య మందిర చిత్రాలు.. నేతన్నలకు పెరుగుతున్న ఆర్డర్లు..

ABN, Publish Date - Jan 08 , 2024 | 09:45 AM

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలతో అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. సంబరాలతో వివిధ రంగాలకు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలతో అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. సంబరాలతో వివిధ రంగాలకు చెందిన కార్మికులకు చేతినిండా ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా బనారసీ చీరలు నేసే నేత కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. చీరల అంచులపై రామ మందిర చిత్రాలు ఉండాలని పలువురు కోరుతున్నారు. రాముడి బాల్యం నుంచి రావణ సంహారం వరకు రామాయణంలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని అంతే కాకుండా చీరల బార్డర్లపై శ్రీరామ నామాలు ఉండాలన్న డిమాండ్ తో ఆర్డర్లు వస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. ఈ చీరల ధరలు రూ.7 వేల నుంచి రూ.లక్ష దాకా ఉన్నాయి.

మరోవైపు.. జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు డెలివరీ చేయాలని గర్భిణులు ఆస్పత్రులకు వస్తున్నారు. పుట్టబోయే పిల్లలకు రాముడి లక్షణాలు కలుగుతాయని ఆశిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నార్మల్ డెలివరీలతో పోలిస్తే.. సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన కేసుల్లో మాత్రం ఈ తేదీనే ఎక్కువగా తల్లిదండ్రులు రిఫర్ చేస్తున్నారన్నారు.


కాగా.. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన కార్డులు విడుదలయ్యాయి. ఎరుపు, బంగారు రంగులో ఉన్న కార్డులపై ఆలయ చిత్రం, పేరు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లోగో ఉన్నాయి. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, గవర్నర్‌, ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ హాజరుకానున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 10:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising