నడ్డాను ఎందుకు విచారించట్లేదు?
ABN, Publish Date - Apr 08 , 2024 | 03:55 AM
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతల్లో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి దొరికిందా అని ఢిల్లీ మంత్రి అతిశీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతల్లో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి దొరికిందా అని ఢిల్లీ మంత్రి అతిశీ ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చి చివరికి అప్రూవర్‌గా మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీకి విరాళం ఇచ్చిన తర్వాత శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ, సీబీఐ చెబుతోందని, అలాంటి వ్యక్తి బీజేపీకి విరాళం ఇవ్వడంపై దర్యాప్తు సంస్థలు ఎందుకు నోరు మెదపడంలేదని, బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. కాగా, కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ ఆదివారం సామూహిక నిరహార దీక్షలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆప్‌తోపాటు ఇండియా కూటమి నేతలు ఈ దీక్షలు చేపట్టినట్టు పార్టీ తెలిపింది.
Updated Date - Apr 08 , 2024 | 03:55 AM