ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..

ABN, Publish Date - May 18 , 2024 | 04:18 PM

తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు.

Kalpana Soren

రాంచీ, మే 18: తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు. అయితే గాందీ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విజయం సాధించడానికే ప్రస్తుతం తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

జూన్ 4వ తేదీ.. అంటే ఎన్నికల ఫలితాలు అనంతరం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపడతారంటూ కొంత మంది రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారని ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కల్పనా సోరెన్‌ పైవిధంగా సమాధానం ఇచ్చారు. జేఎంఎం పార్టీలోని శ్రేణుల కోసం తాను అంకిత భావంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Swati Maliwal: స్వాతి మలివాల్‌ గాయాలపై ఎయిమ్స్ నివేదిక


తాను గాంధీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని తొలుత నిర్ణయించుకొన్నాని.. తన నిర్ణయాన్ని ప్రజలు ప్రేమతో స్వాగతించారని గుర్తు చేశారు. హేమంత్ సోరెన్‌లో త్యాగ గుణం, కష్టించి పని చేసే తత్వాన్ని తాను ఇష్టపడ్డతానని చెప్పారు.

ప్రజల్లోకి ఇలా రావడం ఆనందంగా ఉందన్నారు. జూన్ 4వ తేదీన గాంధీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు.. తనకు సంపూర్ణ మద్దతు ఇస్తారన్నారు. దాంతో జార్ఖండ్ అసెంబ్లీలో తాను సభ్యురాలిగా ఎన్నికవుతానని తెలిపారు. కోట్లాది మంది ప్రజలు చూపిస్తున్న ప్రేమానురాగాలను ప్రస్తుతం హేమంత్ సోరెన్ మిస్ అవుతున్నారన్నారు.

Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి


హేమంత్ సోరెన్‌ను కుట్రతో.. తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే హేమంత్ ప్రజలతోనే ఉన్నారన్నారు. హేమంత్ ఇచ్చే సందేశాలను తాను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తానని కల్పనా సోరెన్ వెల్లడించారు.

Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?

ఇక భూ కుంభకోణంలో హేమంత్‌పై ఈడీ మోపిన అభియోగాలన్నీ తప్పుల తడక అని ఈ సందర్బంగా ఆమె అభివర్ణించారు. అందుకు సంబంధించిన నేటికి ఒక్క ఆధారం కూడా ఈడీ బయట పెట్టలేదని కల్పనా సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 04:23 PM

Advertising
Advertising