Jammu and Kashmir: కవల పిల్లల గొంతు కోసిన తల్లి
ABN, Publish Date - Jul 11 , 2024 | 08:40 PM
ఆడ మనిషి ఏ బాధనైనా భరిస్తుంది. కడుపు కోతను మాత్రం భరించలేదు. నవ మాసాలు మోసి.. కవల పిల్లలు.. అదీ ఆడ పిల్లలను కన్నది. అయితే ఈ బిడ్డలు తన బిడ్డలకు కాదన్నాడు ఆమె భర్త. ఆ నిందను ఆ తల్లి భరించలేకపోయింది.
న్యూఢిల్లీ, జులై 11: ఆడ మనిషి ఏ బాధనైనా భరిస్తుంది. కడుపు కోతను మాత్రం భరించలేదు. నవ మాసాలు మోసి.. కవల పిల్లలు.. అదీ ఆడ పిల్లలను కన్నది. అయితే ఈ బిడ్డలు తన బిడ్డలకు కాదన్నాడు ఆమె భర్త. ఆ నిందను ఆ తల్లి భరించలేకపోయింది. అంతే.. ఆ కవల పిల్లల గొంతు చాకుతో కోసేసేంది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో మెంధార్ సబ్ డివిజన్లోని చైజల గ్రామంలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం, సౌదీ అరేబియాలో పని చేస్తున్న వ్యక్తి చాలా కాలం తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కొంతకాలం అనంతరం అతని భార్య కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఈ పిల్లలు అక్రమ సంబంధం ద్వారా జన్మించారంటూ.. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ చిన్నారుల గొంతను ఆ తల్లి చాకుతో కోసేసింది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Shiv Sena: పూజా కేడ్కర్ ‘వ్యవహారం’పై స్పందించిన ఎంపీ
Also Read: Peshawar: సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Also Read: Uttarakhand:బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ
అయితే ఈ బిడ్డను ఆమె భర్త హత్య చేశారని తొలుత సందేహం సర్వత్ర వ్యక్తమైంది. పోలీసుల విచారణలో అతడి భార్యను ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది. దీంతో ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ యోగల్ మన్హాస్ వెల్లడించారు. ఇక కవల పిల్లల దారుణంగా చంపడంతో ఆ తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఆ శిశువుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం కోసం తరలించారు.
Also Read: UttarPradesh: 17 మంది వైద్యులపై వేటు వేసిన ప్రభుత్వం
Also Read: IAS officer: పూజా కేడ్కర్ ‘డిమాండ్లు’.. వాట్సప్ చాట్ వైరల్
Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి రాహుల్ వీడియో సందేశం..
Also Read: Rajendra Nagar MLA: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 08:42 PM