ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Noida: యూనివర్సిటీ వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. అవే నీటిని వాడిన లెక్చరర్ల పరిస్థితి ఎలా ఉందంటే

ABN, Publish Date - May 07 , 2024 | 12:10 PM

ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఓ యూనివర్సిటీలో మంగళవారం బయటపడింది. వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించడంతో.. లెక్చర్లర్లు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కారణం.. ఆ నీటిని రెండు రోజులుగా వాడుతుండటం.

నోయిడా: ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) ఓ యూనివర్సిటీలో మంగళవారం బయటపడింది. వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించడంతో.. లెక్చర్లర్లు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కారణం.. ఆ నీటిని రెండు రోజులుగా వాడుతుండటం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన భర్త, అత్తతో కలిసి గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ సమీపంలో నివసిస్తోంది.

వారు జిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. మహిళకు భర్తతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి సైతం గొడవ జరగడం.. అది కాస్తా పెద్దదిగా మారడంతో.. భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో పడేశాడు.


ఆదివారం నుంచి సదరు మహిళ కనిపించట్లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వాటర్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే వాటర్ ట్యాంక్ నీటిని యూనివర్సిటీ స్టాఫ్, విద్యార్థులు వాడటం నిర్ఘాంతపరిచింది.

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలతో వారంతా ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Latest News and National News Here..

Updated Date - May 07 , 2024 | 12:10 PM

Advertising
Advertising