Yearender 2024: పని చేసే చోట మహిళల భద్రత ఆందోళనకరం
ABN, Publish Date - Dec 30 , 2024 | 08:22 PM
పని చేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళల పరిరక్షణ (పీఓఎస్‌హెచ్) చట్టం 2013లో వచ్చింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఇటువంటి అనేక చర్యలు అమలవుతున్నాయి.
న్యూఢిల్లీ: అనేక చట్టాలు అమలవుతున్నప్పటికీ, పని చేసే చోట మహిళలు ఇప్పటికీ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కార్పొరేట్ కంపెనీల్లో సైతం మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.
Yearender 2024: మంచి మాటలే మోదీ దౌత్య సాధనాలు
పని చేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళల పరిరక్షణ (పీఓఎస్‌హెచ్) చట్టం 2013లో వచ్చింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఇటువంటి అనేక చర్యలు అమలవుతున్నాయి. వీటివల్ల మన దేశంలో పని చేస్తున్న విదేశీ కంపెనీల్లో కూడా మహిళల రక్షణకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. వేధింపులను బయటకు చెప్పుకోలేని సంస్కతికి తెరపడింది. బ్యూటీపార్లర్ల నుంచి సినిమాల వరకు అన్ని రంగాల్లోనూ మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. కేరళ చలనచిత్ర రంగంలో వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు సష్టించింది. కొందరు సినీ ప్రముఖుల తీరును కొందరు నటీమణులు బయటపెట్టారు. మలయాళం సినీ పరిశ్రమలో మాఫియా తరహా వ్యవహారాలు నడుస్తున్నాయని నటి, దర్శకురాలు గీతు మోహన్ విమర్శించారు. కెరీర్‌ను కాపాడుకోవడానికి మహిళా నటులను ఏ విధంగా అణగదొక్కుతున్నారో ఆమెతో పాటు మరికొందరు కూడా బయటపెట్టారు.
వైద్య రంగంలో నర్సులు, వైద్యులు కూడా వేధింపులకు గురవుతున్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఓ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక హింసకు గురవుతున్నట్లు ది లాన్సెట్ జర్నల్‌లో ఓ వ్యాసం పేర్కొంది. ముఖ్యంగా దిగువ స్థాయిలో పనిచేసే మహిళలు మాటల ద్వారా, శారీరక లేదా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.
క్రీడల్లోనూ లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద చేసిన ఆందోళనలు సైతం కొద్దికాలం క్రితం దేశ రాజధానిని కుదిపేశాయి. ఏది ఏమైనప్పటికీ పని చేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి, దోషులను శిక్షించే అధికారం ఈ కమిటీలకు ఉండాలని మహిళలు కోరుతున్నారు.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News
Updated Date - Dec 30 , 2024 | 08:24 PM