ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yogi Adityanath: బుల్డోజర్ తో గ్యాంగ్ స్టర్ ఇల్లు కూల్చివేత.. నేరగాళ్లకు యోగి సర్కార్ వార్నింగ్..

ABN, Publish Date - Jan 04 , 2024 | 04:02 PM

నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చిన బుల్డోజర్.. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. తాజాగా.. యోగి సర్కార్ నేరగాళ్లపై మరోసారి చర్యలు తీసుకుంది.

నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చిన బుల్డోజర్.. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. తాజాగా.. యోగి సర్కార్ నేరగాళ్లపై మరోసారి చర్యలు తీసుకుంది. రౌడీ షీటర్ అశోక్ యాదవ్ అలియాస్ మున్నా యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. బుల్డోజర్ తో అతని ఇంటిని కూల్చివేశారు. నిబంధనలు అతిక్రమించి ఇల్లును నిర్మిస్తున్నారని అతనిని పోలీసులు అడ్డుకున్నారు. డిసెంబరు 25న మున్నాను అరెస్టు చేయడానికి పోలీసులు బిషున్‌గర్ ప్రాంతంలోని ధరి ధీర్‌పూర్ నగరియ గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో మున్నా ఇంటి లోపలే ఉన్నారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ద్వారా పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. వారు రాగానే ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సచిన్ రాఠీ అనే కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎన్‌కౌంటర్‌లో హిస్టరీ-షీటర్ మున్నా యాదవ్, అతని కుమారుడిని అరెస్టు చేశారు. వారి అక్రమ ఆస్తులపై విచారణ చేసేందుకు రెవెన్యూ బృందం నగరియ గ్రామానికి చేరుకుంది. అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాత.. మున్నా నిబంధనలను అతిక్రమించాడని ప్రభుత్వం గుర్తించింది. అనంతరం ఇల్లు కూల్చేసే చర్యలు తీసుకున్నారు. ఇంటిని కూల్చివేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా.. మృతి చెందిన కానిస్టేబుల్ సచిన్ రాఠీకి ఒక చెల్లెలు, ఒక అన్నయ్య ఉన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 04:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising