ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YouTube: తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:20 AM

పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ ఇకపై తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • స్టేటస్‌ వీక్షణకు వాట్సా్‌పలో కొత్త ఫీచర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: పిల్లల యూట్యూబ్‌ నియంత్రణ ఇకపై తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో పిల్లల యూట్యూబ్‌ ఖాతాను తల్లిదండ్రుల అకౌంట్‌కు లింక్‌ చేయొచ్చు. యూట్యూబ్‌ ఫ్యామిలీ సెంటర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో పిల్లలు ఏదైనా వీడియో అప్‌లోడ్‌ చేసినా, లైవ్‌స్ట్రీమింగ్‌ మెదలుపెట్టినా వెంటనే తల్లిదండ్రులకు ఈ మెయిల్‌ ద్వారా నోటిఫికేషన్‌ అందుతుంది.


అలాగే యూట్యూబ్‌లో పిల్లలు అప్‌లోడ్‌ చేసే వీడియోలు, సబ్‌స్ర్కైబ్‌ చేసే చానళ్లు, కామెంట్లు, పోస్టుల గురించి తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. అంటే తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లల యూట్యూబ్‌ అకౌంట్‌ ఉంటుందన్న మాట. తల్లిదండ్రులు తమ యూట్యూబ్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఫ్యామిలీ సెంటర్‌ పేజ్‌’ను ఎంచుకుని ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. అండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. మరోవైపు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల కాంటాక్ట్స్‌లోని వారు స్టేటస్‌ పెట్టినట్లయితే.. వారి ప్రొఫైల్‌ పిక్చర్‌ చుట్టూ ఒక పచ్చని వలయం కనిపిస్తుంది. దానిపై నొక్కి వారి స్టేట్‌సను వీక్షించవచ్చు.

Updated Date - Sep 06 , 2024 | 05:20 AM

Advertising
Advertising