ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bone Health: ఈ పదార్థాలు మీ ఎముకలను బలహీనపరుస్తాయి.. తప్పక తెలుసుకోండి..

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:40 PM

Bone Health: శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ శరీరం ఎముకల మద్దతుతోనే నిలుస్తుంది. ఎముకలు లేకుండా మానవ శరీరం నిర్మాణం అసాధ్యం. అందుకే శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉంటే.. మన శరీరం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది ఎముకలను బలహీన పరిచే ఆహార పదార్థాలనే అధికంగా తీసుకుంటున్నారు.

Health Tips: Sugar Salt Soft Drinks Can Harm to Bones, check here details siva

Bone Health: శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ శరీరం ఎముకల మద్దతుతోనే నిలుస్తుంది. ఎముకలు లేకుండా మానవ శరీరం నిర్మాణం అసాధ్యం. అందుకే శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉంటే.. మన శరీరం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది ఎముకలను బలహీన పరిచే ఆహార పదార్థాలనే అధికంగా తీసుకుంటున్నారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు బలహీనపడటం సాధారణం.. కానీ, యువతలోనూ ఎముకలు బలహీనపడం కలవరపెడుతున్న అంశం. అయితే, యువతలో ఎముకలు బలహీనమవడానికి కారణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

ఎముకలు బలహీనమవడానికి అనేక పదార్థాలు ఉన్నాయి. వాటిని తినడం, తాగడం ద్వారా ఎముకలు క్రమంగా బలహీనం అవుతాయి. అందుకే తినే, తాగే పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

స్వీట్లు తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి..

ఏదైనా అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అదే విధంగా, ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ప్రస్తుత కాలంలో ప్రతి ప్యాకెట్, క్యాన్డ్ ఫుడ్ ఐటెమ్‌లో చక్కెర కలుపుతున్నారు. ఇది ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా ఎముకలను బోలుగా మార్చేస్తున్నాయి.

సాఫ్ట్ డ్రింక్..

శీతల పానీయాలు మన శరీరానికి చాలా హానికరం. ఇందులో చక్కెర మాత్రమే కాకుండా.. శరీరం నుండి కాల్షియంను గ్రహించడంలో సహాయపడే ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది.

ఉప్పు..

ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఉప్పును తీసుకుంటూనే ఉంటాం. కానీ ఉప్పును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు అధిక వినియోగం భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.

అధిక ఐరన్ పదార్థాలు..

ఐరన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, శరీరంలో దాని అధిక పరిమాణం కారణంగా శరీరం కాల్షియంను గ్రహించలేకపోతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం.

Updated Date - Feb 11 , 2024 | 10:40 PM

Advertising
Advertising