ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lifestyle: ఈ పది అలవాట్లతో మీ జీవితం గుర్తుపట్టలేనంతా మారిపోతుంది!

ABN, Publish Date - May 27 , 2024 | 09:36 PM

జీవితంలో సంతోషంగా ఉండాలన్నా అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం పదండి.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్ లో సుఖసంతోషాలతో జీవించాలని, వృత్తి జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, అందరూ జీవితాన్ని తాము అనుకున్న రీతిలో గడపలేరు. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, విజయం సాధించాలంటే మాత్రం జీవితంలో కొన్ని మార్పులు (Lifestyle) తప్పనిసరి. కొన్ని అలవాట్లతో జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వేగంగా మెరుగుపడుతుంది. చివరకు అనుకున్న గమ్యం చేరుకోవచ్చు. మరి ఈ అలవాట్లేంటో ఓసారి చూద్దాం (10 habits that can change your life for better).


  • జీవితం మెరుగుపడాలంటే ముందుగా పౌష్టికాహారం తినాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఉత్తేజకరమైన ఆలోచనలు జనిస్తాయి. చివరకు అనుకున్న లక్ష్యాల్ని సులువుగా చేరగలుగుతారు.

  • రోజూ తగినంతగా నిద్ర పోవాలి. దీంతో, అలసట తీరి మరుసటి రోజు పనిమీద పూర్తిగా దృష్టికేంద్రీకరించగలుగుతాం. ఫలితంగా సమస్యల పరిష్కారం సులువవుతుంది.

  • రోజూ కసరత్తులు చేసే అలవాటు ఉన్న వాళ్లలో సంతోషకర హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. దీంతో, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కసరత్తులతో కండరాలు, ఎములు గట్టిపడతాయి. రోగ నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. అంతిమంగా ఇది లైఫ్ స్టైల్ మెరుగుదలకు దారి తీస్తుంది.

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేయడం లేదని తెలుసుకోవాలనుందా..? ఈ 5 సింపుల్ చిట్కాలతో..!

  • మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వడం.. అంటే ఓ పుస్తకంలో లేదా డైయిరీలో రాసుకోవాలి. ఈ అలవాటుతో మనపై మనకే అవగాహన పెరుగుతుంది. జీవితంపై క్లారిటీ వస్తుంది. అంతిమంగా దీంతో సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఇనుమడిస్తుంది.

  • పుస్తకపఠం ఎంతో ముఖ్యమైన అలవాటు. దీంతో, కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు మానసిక పరిణితి వస్తుంది.

  • జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు న్న దాన్ని చూసి సంతోషించాలి. మనకున్న అవకాశాలు, సౌకర్యాలను దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ అలవాటుతో సానుకూల దృక్పథం పెరిగి జీవితం ఆనందమయం అవుతుంది.

  • మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో రెట్లు ఇనుమడిపం చేస్తాయి. పరిస్థితులపై, మనపై మనకే అవగాహన పెంచి అంతిమంగా జీవన సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే స్థితికి తీసుకెళతాయి.

  • ప్రతి లక్ష్యాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే అలవాటు చేసుకోవాలి. ఒకసారి సమయపాలన అలవాటైతే ఇక జీవితంలో అద్భుతాలు జరగుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

  • నిత్యం పనిపైనే దృష్టి పెట్టకుండా మనకంటూ ఓ వ్యాపకం ఉండేలా చూసుకోవాలి. పనికి విరామమిచ్చి ఇలాంటి ఆహ్లాదకర పనులతో సేద తీరాలి. ఇది మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. సామాజికంగా ముందుకు వెళ్లేందుకు ఉపకరిస్తుంది.

Read Latest Telugu News

Updated Date - May 27 , 2024 | 09:42 PM

Advertising
Advertising