ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Story : కోటి రూపాయల కుండలు

ABN, Publish Date - Jul 25 , 2024 | 05:18 AM

ధర్మపురంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడుఅతని వద్ద ఒక ముసలి ఏనుగు ఉండేది. ఆ ఊరి జనం పండగలు, పెళ్లిళ్లు, తిరునాళ్లు, ఊరేగింపులకు ఆ ఏనుగును అద్దెకు తీసుకొని, కేశవయ్యకు డబ్బు చెల్లిస్తూ ఉండేవారు. ఒక రోజు రామయ్య తన కొడుకు పెళ్లి అని ఆ ఏనుగును అద్దెకు తీసుకున్నాడు. ఊరేగింపు జరిగినంత సేపూ ఏనుగు బాగానే ఉండి,

ధర్మపురంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడుఅతని వద్ద ఒక ముసలి ఏనుగు ఉండేది. ఆ ఊరి జనం పండగలు, పెళ్లిళ్లు, తిరునాళ్లు, ఊరేగింపులకు ఆ ఏనుగును అద్దెకు తీసుకొని, కేశవయ్యకు డబ్బు చెల్లిస్తూ ఉండేవారు. ఒక రోజు రామయ్య తన కొడుకు పెళ్లి అని ఆ ఏనుగును అద్దెకు తీసుకున్నాడు. ఊరేగింపు జరిగినంత సేపూ ఏనుగు బాగానే ఉండి, చివరలో అనారోగ్యానికి గురై కిందపడి, అక్కడే చనిపోయింది. రామయ్య ఈ విషయం వెంటనే కేశవయ్యకు చెప్పి, దాని ధర ఎంతో చెల్లిస్తాననీ, ఏనుగు అంత్య క్రియలు కూడా తానే చేస్తాననీ, ఎంత చెప్పినా కేశవయ్య వినకుండా, దానిని నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను. నాకు నా ఏనుగును తెచ్చివ్వు లేదా నీ ఆస్తి మొత్తం నాకు రాసివ్వు అని గొడవ చేసాడు. చుట్టూ ఉన్నవారు ఈ విషయం పంచాయితీ పెద్దకు ఫిర్యాదు చేయడం మంచిది అని సలహా ఇచ్చారు. అలాగే అని కేశవయ్య వెళ్లి పంచాయితీలో విషయమంతా చెప్పాడు అంతా విన్న పంచాయితీ పెద్ద, కేశవయ్యను వెళ్లి రామయ్యను వెంటనే పిలుచుకొస్తే విచారణ చేస్తాననీ, చెప్పి పంపాడు. కేశవయ్య రామయ్య ఇంటికి వచ్చి, తలుపు గడియ వేసి లేకపోవడంతో తలుపును ఒక్కసారిగా తోశాడు. ఆ దెబ్బతో తలుపుకు ఆనుకుని ఉన్న కుండల దొంతర కిందపడి కుండలన్నీ పగిలి పోయాయి. పగిలిన కుండలను చూసుకుంటూ రామయ్య ఇవి నాకెంతో ఇష్టమైన కుండలు, ఇపుడు నీ వల్ల పగిలి పోయాయి. ‘వీటికి కోటి రూపాయలు నష్ట పరిహారం కటు’్ట అని గొడవ చేసాడు ఆ మాటలకు కేశవయ్య ‘ఏమిటీ కుండలకు కోటి రూపాయలా? ఇదేమన్న న్యాయంగా ఉందా’? అని అడిగాడు. ‘మరి ముసలి ఏనుగుకు నా ఆస్తి మొత్తం రాసిమ్మనడం మాత్రం న్యాయంగా ఉందా కేశవయ్యా?’ అన్నాడు రామయ్య. వెంటనే కేశవయ్యకు విషయం అర్థమైపోయి, రామయ్య ఇచ్చిన సొమ్ము తీసుకుని, ఏనుగు విషయం వదలివేశాడు.

Updated Date - Jul 25 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<