ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Addiction : మందులు వ్యసనంగా మారితే?

ABN, Publish Date - Oct 22 , 2024 | 05:56 AM

తలనొప్పి వేధిస్తే మందుల షాపుకు వెళ్లి పెయిన్‌ కిల్లర్‌ కొని వాడుకుంటాం! అంతే తప్ప వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయం.

అడిక్షన్‌

కొన్ని నొప్పి నివారణ మందులు కాలేయం, మూత్రపిండాలు మొదలైన అంతర్గత అవయవాల మీద ప్రభావం చూపిస్తాయి. అప్పటికే ఆ అవయవాల్లో సమస్యలున్న వాళ్లకు, పెయిన్‌ కిల్లర్స్‌ మరింత చేటు చేస్తాయి.గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి పైబడే వయసుతో కూడిన ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే ప్రధాన అంతర్గత అవయవాలు అప్పటికే కొంత మేరకు దెబ్బ తిని ఉంటాయి. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు ఎన్‌ఎస్‌ఐడి పెయిన్‌ కిల్లర్స్‌ను వాడుకుంటే నష్టం రెండింతలుంటుంది.

నొప్పి తగ్గించే మందులతో తక్షణ ఉపశమనం దొరికే మాట నిజమే! అయితే వాటికి అలవాటు పడే ముప్పు కూడా పొంచి ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. దీర్ఘకాలంలో అంతర్గత అవయవాలను సైతం దెబ్బతీసే ప్రమాదం ఉన్న ఈ మందులతో అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు వైద్యులు.

లనొప్పి వేధిస్తే మందుల షాపుకు వెళ్లి పెయిన్‌ కిల్లర్‌ కొని వాడుకుంటాం! అంతే తప్ప వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయం. అయితే నొప్పిని తగ్గించే ఈ మందుల వాడకంతో రెండు రకాల సమస్యలు పొంచి ఉంటాయి. వీటితో తక్షణ ఉపశమనం దక్కుతుంది కాబట్టి నొప్పికి మూల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో, దాంతో సమస్య మరింత ముదిరిపోయి చికిత్సకు లొంగని పరిస్థితి తలెత్తవచ్చు. అంతే కాకుండా నొప్పి తగ్గడంతో కలిగే ఉపశమనానికి అలవాటు పడిపోయి, నొప్పి నివారణ కోసం అవే మందుల మీద ఆధారపడుతూ, వాటికి వ్యసనపరులుగా మారిపోతూ ఉంటాం. ఇంతకంటే ప్రమాదకరమైన ఇంకొక సమస్య ఏంటంటే, కొన్ని నొప్పి నివారణ మందులు కాలేయం, మూత్రపిండాలు మొదలైన అంతర్గత అవయవాల మీద ప్రభావం చూపిస్తాయి. అప్పటికే ఆ అవయవాల్లో సమస్యలున్న వాళ్లకు, పెయిన్‌ కిల్లర్స్‌ మరింత చేటు చేస్తాయి. నిజానికి తలనొప్పి, కాళ్ల నొప్పులు, కడుపు నొప్పి లాంటి సర్వసాధారణమైన నొప్పులు, బాధలను తగ్గించుకోవడం కోసం అడపా దడపా పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే ఫరవాలేదు. కానీ అన్ని నొప్పులకూ వాటి మీదే ఆధారపడడం ఎంత వరకూ సమంజసమో ఎవరికి వారు ఆలోచించుకోవాలి.


  • పెయిన్‌ కిల్లర్స్‌ ఎప్పుడు?

చికిత్సకు అవకాశం లేకుండా, పూర్తిగా ముదిరిపోయిన కేన్సర్లతో బాధపడే రోగులకు, వాళ్ల జీవన నాణ్యతను పెంచడం కోసం వైద్యులు నొప్పి తగ్గించే మందులు సూచిస్తూ ఉంటారు. ఇంకొందరికి జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. ఇంకొందరికి ఆర్థ్రయిటిస్‌తో కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. మయాల్జియాలో తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయి. కొందరికి మైగ్రెన్‌ తలనొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి వేర్వేరు సందర్భాల్లో, నొప్పులను అదుపు చేయడం కోసం వైద్యులు తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా పెయిన్‌ కిల్లర్స్‌ను సూచిస్తూ ఉంటారు. అలాగని వేరే సందర్భాల్లో తాత్కాలికంగా నొప్పులను తగ్గించుకోవడం కోసం పెయిన్‌ కిల్లర్స్‌ వాడుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. నెల మొత్తంలో ఒకట్రెండు సార్లు వాడుకోవడం సురక్షితమే! కానీ ఇష్టారాజ్యంగా వీటిని వాడుకోవడం మాత్రం ఆరోగ్యకరం కాదు.


  • ఏవి సురక్షితం?

ప్రతి మందుల షాపులో పెయిన్‌ కిల్లర్స్‌ను ఎటువంటి ప్రిస్ర్కిప్షన్‌తో పని లేకుండా కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది. అయితే మనం కొనుక్కుంటున్న పెయిన్‌ కిల్లర్స్‌ ఏ రకానికి చెందినవో మనకెలా తెలుస్తుంది? ఈ మందుల్లో ‘నాన్‌ స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ (ఎన్‌ఎస్‌ఐడి), ఓపిఆయిడ్‌ అనాల్జెసిక్స్‌.. అనే రెండు రకాలుంటాయి.

  • ఎన్‌ఎస్‌ఐడి:

ఈ మందులతో కాలేయం, మూత్రపిండాల మీద చెడు ప్రభావం పడడంతో పాటు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా మొదలవుతాయి. అప్పటికే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి పైబడే వయసుతో కూడిన ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే ప్రధాన అంతర్గత అవయవాలు అప్పటికే కొంత మేరకు దెబ్బ తిని ఉంటాయి. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు ఎన్‌ఎస్‌ఐడి పెయిన్‌ కిల్లర్స్‌ను వాడుకుంటే నష్టం రెండింతలుంటుంది. దాంతో మూత్రపిండాలు ఫెయిలైపోవడం, కడుపులో అల్సర్లు ఏర్పడి, పుండ్లు పడడం, కాలేయం ఫెయిలైపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.


  • ఓపిఆయిడ్‌ ఎనాల్జెసిక్స్‌:

ట్రెమడాల్‌ లాంటి ఈ కోవకు చెందిన మందులు సురక్షితమైనవే అయినా వీటికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. కొందరికి డి విటమిన్‌ లోపంతో నీరసం, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్‌ కిల్లర్‌ వేసుకుంటారు. నొప్పి తగ్గగానే, హాయిగా అనిపిస్తుంది. అయితే అది ఆ రోజు వరకే! మరుసటి రోజు మళ్లీ నొప్పులు వేధిస్తాయి. అప్పుడు కూడా ఉపశమనం కోసం అవే మందులను ఆశ్రయిస్తారు. ఇలా ఆ మందులు వ్యసనంగా మారతాయి. కాబట్టి తాత్కాలికంగా ఒకటి రెండు రోజుల కోసం నొప్పి తగ్గించే మందులు వాడుకున్నా, తర్వాత నొప్పికి మూల కారణాన్ని తెలుసుకోవడం కోసం వైద్యులను కలవాలి. వయసు, ఆరోగ్య పరిస్థితులు, అప్పటికే వాడుతున్న మందులు, వాటి దుష్ప్రభావాలు, నొప్పిని తట్టుకునే తత్వాల ఆధారంగా ఎన్ని రోజుల పాటు, ఏ మోతాదు మేరకు పెయిన్‌ కిల్లర్స్‌ను సూచించవచ్చో వైద్యులు మాత్రమే కచ్చితంగా నిర్ణయించగలుగుతారు.

-డాక్టర్‌ సోమనాథ్‌ గుప్తా

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌,

యశోద హాస్పిటల్స్‌,

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - Oct 22 , 2024 | 05:56 AM