ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చక్కెరకు ప్రత్యామ్నాయంగా..

ABN, Publish Date - Oct 01 , 2024 | 05:30 AM

చక్కెరతో బరువు పెరుగుతామనే విషయం అందరికీ తెలిసిందే! అయితే బరువు పెంచే చక్కెరకు కొన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!

చక్కెరతో బరువు పెరుగుతామనే విషయం అందరికీ తెలిసిందే! అయితే బరువు పెంచే చక్కెరకు కొన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం!

స్టీవియా: స్టీవియా మొక్కతో తయారయ్యే ఈ సహజసిద్ధ తీపిపదార్థం చక్కెరను మించి తీయగా ఉంటుంది. అయినా దీన్లో క్యాలరీలు ఉండవు. కాబట్టి రక్తంలో చక్కెర మోతాదులను అదుపులో ఉంచుకునేవారు, మరీ ముఖ్యంగా మధుమేహులు స్టీవియాను ఎంచుకుంటూ ఉంటారు. ఆహారంలో చక్కెరను పూర్తిగా మానేయాలనుకునేవారు కూడా తీపి తినాలని అనిపించినప్పుడు స్టీవియాతో తయారుచేసుకున్న స్వీట్లను ఎంచుకోవచ్చు.

మాంక్‌ ఫ్రూట్‌: మాంక్‌ ఫ్రూట్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ చక్కెరతో సమానంగా తీయగా ఉంటుంది. ఎలాంటి క్యాలరీలు, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌లూ లేని మాంక్‌ ఫ్రూట్‌ గుజ్జు బేకింగ్‌లకూ, కాఫీల్లో కలుపుకోడానికీ బాగుంటుంది. ఈ ప్రాచీన పండును సంప్రదాయ ఔషధ తయారీల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

ఎరిథ్రిటాల్‌: పండ్లు, పులియబెట్టిన పదార్థాల్లో దొరికే ఈ షుగర్‌ ఆల్కహాల్‌లో 70 శాతం చక్కెర తీయదనం ఉంటుంది. అయినా దీన్లో ఏమాత్రం క్యాలరీలు ఉండవు. ఇది రక్తంలోని చక్కెర మోతాదును ఏమాత్రం పెంచదు. కాబట్టే తక్కువ కార్బ్స్‌తో కూడిన కీటోజెనిక్‌ డైట్‌ను అనుసరించేవాళ్లు తీయదనం కోసం దీన్నే ఎంచుకుంటూ ఉంటారు.

అల్యులోజ్‌: రుచిలో చక్కెరకు ఏమాత్రం తీసిపోని అల్యులోజ్‌ కేవలం 10ు క్యాలరీలనే కలిగి ఉంటుంది. ఇది నాన్‌ గ్లైసెమిక్‌ కూడా! అంటే దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులు ఏమాత్రం పెరగవు. కాబట్టి డిజర్ట్‌ మొదలు డ్రెస్సింగ్‌ల వరకూ ఈ గిల్ట్‌ ఫ్రీ తీపిని ఎంచుకోవచ్చు.

యాకాన్‌ సిరప్‌: యాకాన్‌ మొక్క నుంచి సేకరించే సిరప్‌ క్యారమెల్‌ రుచిని కలిగి ఉంటుంది. ప్రిబయోటిక్స్‌ సమృద్ధిగా కలిగి ఉండే ఈ సిరప్‌ తీయదనాన్ని కలిగి ఉండడంతో పాటు పేగుల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. రోజంతా శక్తి మోతాదులు సమంగా కొనసాగడానికి తక్కువ గ్లౌసెమిక్‌ ఇండెక్స్‌ను కలిగి ఉండే ఈ సిరప్‌, తక్కువ గ్లౌసెమిక్‌ ఇండెక్స్‌ను కలిగి ఉండే ఈ సిర్‌పను ఎంచుకోవచ్చు.

Updated Date - Oct 01 , 2024 | 05:30 AM