ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balakrishna : ‘అన్‌స్టాప్‌బుల్‌’ వెనక కథ!

ABN, Publish Date - Sep 01 , 2024 | 01:03 AM

నేను అప్పటి తరానికే కాదు, ఇప్పటి తరానికి కూడా కనెక్ట్‌ అవుతున్నా. అనుబంధాలు అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే! ‘అన్‌స్టాపబుల్‌ షో’ పెద్ద సక్సెస్‌. యూత్‌ అందరూ చూశారు. ఈ షో పేరు వెనక చిన్న కథ ఉంది.

Balaiah Babu : నేను అప్పటి తరానికే కాదు, ఇప్పటి తరానికి కూడా కనెక్ట్‌ అవుతున్నా. అనుబంధాలు అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే! ‘అన్‌స్టాపబుల్‌ షో’ పెద్ద సక్సెస్‌. యూత్‌ అందరూ చూశారు. ఈ షో పేరు వెనక చిన్న కథ ఉంది. నా పుట్టిన రోజునాడు ముగ్గురు పిల్లలూ మూడు కప్‌లు బహుమతులుగా ఇచ్చారు. పెద్ద పాప బ్రాహ్మిణి ఇచ్చిన కప్పు మీద- ‘ఐయామ్‌ ది ఎల్డెస్ట్‌- సో ఐ మేక్‌ ది రూల్స్‌’ అని ఉంది. చిన్నపాప తేజస్విని ఇచ్చిన కప్పు మీద- ‘ఐయామ్‌ ది మిడిల్‌- ఐ యామ్‌ రీజన్‌ టూ హేవ్‌ ది రూల్స్‌ ’ అని ఉంది. మోక్షజ్ఞ ఇచ్చిన కప్పు మీద - ‘ఐ యామ్‌ యంగెస్ట్‌- రూల్స్‌ డోంట్‌ ఎఫెక్ట్‌ మీ’ అని ఉంది. ఒక రోజు నాకు పుస్తకాలు ఇవ్వటానికి ఒక రచయిత, ఆయన కుమార్తె వచ్చారు.

ఆ పాపను... ‘‘ఈ మూడింటితో ఒక పాట రాస్తావా?’’ అని అడిగా. తను వెంటనే ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, జర్మన్‌ పదాలతో ఒక పాట రాసింది. వినోద్‌ అనే కీబోర్డు ప్లేయర్‌ను ఆ పాటకు ట్యూన్‌ చేయమన్నా. ఇంకో స్నేహితుడి పాప మాటల్లో- ‘‘బోర్‌ కొడుతోంది అంకుల్‌’’ అంది. తనను వచ్చి పాట పాడమన్నా. పాడేసింది. మూడు రోజుల తర్వాత నేను రికార్డింగ్‌ స్టూడియోకి వెళ్లి పాట పాడాను. ఆ పాటే ‘అన్‌స్టాపబుల్‌’. ఈ సంగతి అల్లు అరవింద్‌ గారి దగ్గర ప్రస్తావించినప్పుడు- ఆయన - ‘‘మన షోకు ఆ పేరు పెడదాం’’ అన్నారు. వెంటనే ఇచ్చేశాను. నేను పాడిన ఇంగ్లీషు పాట ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది.

Updated Date - Sep 01 , 2024 | 01:03 AM

Advertising
Advertising