ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Makeup : మొటిమలను దాచేద్దాం

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:07 AM

ముఖం మీద మొటిమలను దాచడానికి మేకప్‌ వేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. లేదంటే మొటిమలు మరింత స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంది. మొటిమలను దాచే మేకప్‌ మెలకువలు ఇవే!

ముఖం మీద మొటిమలను దాచడానికి మేకప్‌ వేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. లేదంటే మొటిమలు మరింత స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంది. మొటిమలను దాచే మేకప్‌ మెలకువలు ఇవే!

మాయిశ్చరైజర్‌: మేకప్‌ చర్మం మీద సమంగా అంటుకోవాలంటే, మొదట ముఖాన్ని శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. జిడ్డు చర్మం కలిగిన వాళ్లు మాయిశ్చరైజర్‌ వాడకూడదు.

ప్రైమర్‌: మేక్‌పకు ముందు అనుసరించవలసిన చిట్కా ఇది. మేకప్‌ ఉత్పత్తులు చర్మంలోకి ఇంకిపోకుండా ప్రైమర్‌ తోడ్పడుతుంది. హెచ్చుతగ్గులు లేకుండా మేకప్‌ చర్మం మీద పరుచుకోవడానికి వీలుగా, ప్రైమర్‌ చర్మాన్ని సిద్ధం చేస్తుంది.

కరెక్టర్‌: మొటిమలను కరెక్టర్‌తో కనిపించకుండా చేయవచ్చు. ఇందుకోసం ఎర్రగా ఉండే మొటిమల మీద ఆకుపచ్చని కరెక్టర్‌ అద్ది, పైన కన్‌సీలర్‌ అద్దుకోవాలి. ఇలా చేయడంవల్ల మొటిమ ఎరుపు రంగు తగ్గి, చర్మంలో కలిసిపోతుంది. మొటిమ ఎరుపు రంగులో లేకపోతే, నేరుగా కన్‌సీలర్‌నే అద్దవచ్చు. కన్‌సీలర్‌ను మొటిమ మీద అద్దాలే తప్ప, రుద్దకూడదు.

లిక్విడ్‌ ఫౌండేషన్‌: బ్రష్‌ లేదా మేకప్‌ స్పాంజ్‌తో ముఖం మీద ఫౌండేషన్‌ను వేసుకోవాలి. అంటే ముఖం మీద ఫౌండేషన్‌ చుక్కలుగా అద్ది, బ్రష్‌ లేదా స్పాంజ్‌తో ముఖాన్ని అద్దినట్టు చేస్తూ, ముఖమంతా పరుచుకునేలా చేయాలి.

మేపక్‌ సెట్టింగ్‌: ఫౌండేషన్‌ పూసుకున్న తర్వాత కొన్ని నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత ప్రెస్‌డ్‌ లేదా లూజ్‌ పౌడర్‌ను అద్దుకోవాలి. తర్వాత ఫినిషింగ్‌ స్ర్పే కూడా వాడుకోవచ్చు.

మచ్చలను దాచాలంటే... : ఫేస్‌ ప్రైమర్‌తో మేకప్‌ మొదలుపెట్టాలి. తర్వాత ప్రైమర్‌, కన్‌సీలర్‌, అంతిమంగా ఫౌండేషన్‌, లూజ్‌ పౌడర్‌ వాడాలి. మచ్చలు నల్లగా లేదా ఎర్రగా ఉంటే, కలర్‌ కరెక్టర్‌ను వాడుకోవచ్చు.

Updated Date - Nov 30 , 2024 | 12:07 AM