Kerala Style Kappa Bonda : వేడి, కారంగా ఉండే రుచికరమైన కేరళ స్టైల్ కప్పా బోండాను ట్రై చేసి చూడండి..!
ABN, Publish Date - Feb 15 , 2024 | 04:20 PM
కప్పా బోండా చేయడం చాలా సులువు. ఇది రుచికరంగానే కాదు. స్నేహితులతో టైం పాస్ తిను బండారం.
వాతావరణాన్ని బట్టి ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. సాయంత్రం చల్లగా ఉన్నా, వర్షం పడినా కూడా వేడి వేడిగా ఏదైన స్నాక్ తినాలనిపిస్తుంది. దీనికోసం పకోడీ, మిరపకాయ్ బజ్జీ, వడ ఇలా చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం. ఈ జాబితాలో చేర్చుకోవాల్సిన మరో ఐటం.. కేరళ స్టైల్ కప్పా బోండా ఈ లిస్ట్ కి సరిగ్గా సరిపోతుంది. టమాటా సాస్ తో బోండా తింటే మరి వదిలిపెట్టరు. దీని తయారీ కూడా చాలా సులువు. ఇందుకోసం..
కప్పా అంటే?
కప్పా అని పిలిచే మైదా పిండి, దీనికి ప్రోసెస్ చేసిన పిండిని వాడతారు. ఇది మలియాలీల ఇష్టమైన పదార్థాలలో ఒకటి. కప్పాను సాధారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ముఖ్యంగా మహారాష్ట్రలో వడలు లేదా ఖిచ్డీ రూపంలో వినియోగిస్తారు.
కేరళ స్టైల్ కప్పా బోండాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.
ఈ కేరళ స్టైల్ కప్పా బోండా చేయడం చాలా సులువు. ఇది రుచికరంగానే కాదు. స్నేహితులతో టైం పాస్ తిను బండారం. సరైన టీ టైమ్ స్నాక్. ఈ రెసిపీ కి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. దీనిని చాలా ఈజీగా తయారు చేయచ్చు.
కేరళ స్టైల్ కప్పా బోండా కోసం పచ్చిమిర్చి, 15 ఉల్లిపాయలు, ముక్కలు
8 ఎర్ర మిరపకాయలు,
½ tsp చింతపండు రసం
రుచికి ఉప్పు, మసాలాలు తీసుకోవాలి. ఒక గిన్నెలో మైదా, మసాలా దినుసులు వేసి అన్ని పదార్థాలను కలపాలి. కొద్దిగా ఉప్పు, నీళ్ళు పోసి ముద్దలా కలుపుకోవాలి. కాసేపు నాననిచ్చి, దీనిని చిన్న బాల్స్‌గా చేయాలి. గోల్డెన్ పర్ఫెక్షన్ వచ్చేవరకు వేయించి, సర్వ్ చేసుకోవడమే. ఈ కేరళ తరహా కప్పా బోండాను టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయవచ్చు.
Updated Date - Feb 15 , 2024 | 04:20 PM